Marijuana Seige | ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తరలింపు.. 16.1 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురిపై కేసు
Marijuana Seige | ఒడిశా నుంచి బస్సులో హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తున్న16.1 కిలోల గంజాయిని గురువారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ ఎస్టీఎప్ పోలీసులు పట్టుకున్నారు.
Marijuana Seige | ఒడిశా నుంచి బస్సులో హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తున్న16.1 కిలోల గంజాయిని గురువారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ ఎస్టీఎప్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి బస్సులో రూ.3 లక్షల విలువ చేసే గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్న విషయమై నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో హయత్ నగర్ వద్ద బస్సులో తనిఖీ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ఎన్. అంజి రెడ్డి తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్న జయదేవ్ నెలూర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు ప్రశ్నించినప్పుడు ధూల్‌పేటలోని అశోక్ సింగ్‌కు ఇవ్వడానికి గంజాయి తెచ్చినట్లు జయదేవ్ నెలూర్ చెప్పాడు. కాగా, అశోక్ సింగ్ తప్పించుకున్నాడని ఎస్టీఎఫ్ పోలీసులు చెప్పారు.
గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఒడిశా వ్యక్తి మిలన్‌దేవ్‌నాథ్ గంజాయిని అమ్మకాలు సాగించేవాడు. ఆయనపై పలు కేసులు నమో దు కావడంతో ఒడిశాకు వెళ్లి అక్కడి నుంచి తన మనుషుల ద్వారా గంజాయిని పంపిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ అంజి రెడ్డి తెలిపారు. ఈ కేసులో గంజాయి తెచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేసిన అశోక్‌సింగ్, గంజాయిని పంపిన మిలన్దేవ్నాథ్పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
కొత్తగా వచ్చిన ఎన్డీపీఎస్ యాక్ట్ చట్టాల ప్రకారం సెక్షన్ 105 అండ్ 185 బీఎన్ఎస్ఎస్ (కొత్తచట్టం) ప్రకారం వీడియో తీయించి పకడ్బందిగా కేసును నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంట్ ఎన్ అంజి రెడ్డితోపాటు సీఐ ఎంపిఆర్ చందశ్రేఖర్, ఎస్సై సాయికిరణ్, సిబ్బంది యాదగిరి రాజు, యాదగిరి, మహేష్, రజనీకాంత్, అశ్విన్, వాసు, ప్రభు, రాహుల్ ఉన్నారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ పీ ప్రణవి అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

