లేహ్ : దేశంలో లాంగ్ డిస్టాన్స్ రేసులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే లడక్ మారథాన్‌ను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. 12వ ఎడిషన్‌గా జరుగబోయే ఈ పోటీల్లో ఆరు రేసులు ఉండనుండగా సుమారు 31 దేశాల నుంచి 6,600 మంది రన్నర్లు ఈ ఈవెంట్లో పాల్గొననున్నట్టు మారథాన్ ఆర్గనైజర్లు తెలిపారు.
సిల్క్‌రోడ్ అల్ట్రా (122 కి.మీ), ఖర్దంగ్ ల చాలెంజ్ (72 కి.మీ), రన్ లడక్ ఫర్ ఫన్ (5 కి.మీ)తో పాటు హాఫ్ మారథాన్ (21 కి.మీ.), 11.2 కి.మీ రేసు, ఫుల్ మారథాన్ (42.19 కి.మీ)గా పోటీలను నిర్వహించనున్నారు. ఈనెల 11 నుంచి 14 దాకా ఈ పోటీలు జరుగనున్నాయి.