IND vs AUS | ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్
IND vs AUS | భారత్-అస్ట్రేలియా (India vs Australia) దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్లు (Indian batters) అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగి ఆడటంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది.
IND vs AUS : భారత్-అస్ట్రేలియా (India vs Australia) దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్లు (Indian batters) అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగి ఆడటంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 237 పరగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా కేవలం 38.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో రెన్షా (56) మాత్రమే అర్ధశతకం సాధించాడు. మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ (29), మాథ్యూ షార్ట్ (30), అలెక్స్ క్యారీ (24), కూపర్ కాన్లీ (23) పరవాలేదనిపించారు. ఆఖరులో బౌలర్ నాథన్ ఎలిస్ (16) కాస్త మెరుపులు మెరిపించినా మిగతా వాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా తన సత్తా చూపించాడు. 8.4 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (121) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 125 బంతుల్లో అజేయంగా 121 (13×4, 6×3) పరుగులు చేశాడు. రోహిత్‌కు జతగా ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (24) ధాటిగానే ఆటను ప్రారంభించినా 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్‌డౌన్‌గా బరిలో దిగిన కోహ్లీ (74; 7×4) రోహిత్ శర్మతో కలిసి ఆసీస్ టీమ్‌కు చుక్కలు చూపించారు. అయితే మూడు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియాకు ట్రోఫీ దక్కింది. సిరీస్‌ను 2-1 తేడాతో ఆసీస్ గెలుచుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

