కుభీర్ : రైతులు తాము పండించిన పత్తిని సీసీఐకు అమ్మాలంటే ప్రతి రైతు వ్యక్తిగతంగా ‘ కపాస్ కిసాన్ ’ (Kapas Kisan Aap) అనే మొబైల్ యాప్‌ను కలిగి ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి సారిక రావు ( Sarika Rao) తెలిపారు. నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubeer ) మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శనివారం ఏఈవోలకు యాప్‌పై పత్తి రైతులు వంద శాతం డౌన్లోడ్ చేసుకునే విధంగా ఆమె అవగాహన కల్పించారు.
ఈ యాప్‌ను రైతులు తమ మొబైల్ ఫోన్లోని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ అయిన తేదీ నుంచి మాత్రమే మిల్లుకు పత్తిని తీసుకొని రావాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకోకుండా మిల్లుకు పత్తిని తీసుకొని వెళ్తే పత్తి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండబోదని హెచ్చరించారు.
పత్తి సాగు చేసిన రైతులు తమ ఫోన్ నెంబర్లు యాక్టివేషన్లో లేకపోతే ఏఈఓలు అప్‌గ్రేడేషన్ చేసివ్వాలని సూచించారు.మండలంలోని ఏఈవోలు పత్తి రైతులకు అందుబాటులో ఉండి వారు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ విస్తీర్ణ అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఏఈవోలు చరణ్ రాజ్, ఎం.నారాయణ తో పాటు ఆయా క్లస్టర్ల ఏఈవోలు పాల్గొన్నారు.