Farmers | రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు.. ఎండు తెగులు నివారణపై ఏఈఓ నాగార్జున
Farmers | రైతులు యాసంగి కూడా అదే భూమిలో పంట మార్పిడి లేకుండా మళ్లీ మొక్కజొన్న లేదా బీన్స్ వంటి పంటలు సాగు చేసినట్లయితే మళ్లీ ఎండు తెగులు సోకే అవకాశం ఉంటుంది. కావున రైతులు తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ యాసంగి అధిక దిగుబడులు పొందవచ్చునన్నారు ఏఈఓ నాగార్జున.
Farmers | తొగుట, అక్టోబర్ 25 : పెద్ద మాసాన్ పల్లి గ్రామం వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడి వినియోగం, రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో వృద్ధి చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈఓ నాగార్జున మాట్లాడుతూ.. వానాకాలం మొక్కజొన్న పంటకు ఎండు తెగులు ఆశించింది.
రైతులు యాసంగి కూడా అదే భూమిలో పంట మార్పిడి లేకుండా మళ్లీ మొక్కజొన్న లేదా బీన్స్ వంటి పంటలు సాగు చేసినట్లయితే మళ్లీ ఎండు తెగులు సోకే అవకాశం ఉంటుంది. కావున రైతులు తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ యాసంగి అధిక దిగుబడులు పొందవచ్చునన్నారు.
ఎండు తెగుళ్లు నివారణ కొరకు విత్తనం విత్తేముందు ట్రైకోడెర్మా విరిడితో నేల, విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీంద్రాలను ఆశించి, నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్లను సమర్ధవంతంగా అరికట్టడానికి ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంధ్రం ఎంతో ఉపయోగపడుతుంది.
విత్తన శుద్ధి ఒక్క కిలో విత్తనానికి ట్రైకోడెర్మా వెరిడి పొడి 10గ్రాములు, ద్రవరూపంలో అయితే 10 ఎంఎల్ విత్తనానికి పట్టించి 20 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలని సూచించారు.
రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో వృద్ధి చేసే విధానం..
90కిలోల బాగా చివికిన పశువుల ఎరువును తీసుకుని దీనికి 10కిలోల వేపపిండిని కలిపాలి. దీన్ని నీడవున్న ఎత్తైన ప్రదేశంలో చదరంగా గుట్టగా పోయాలి. దీనిపై 1 నుండి 2 కిలోల పొడి లేదా ఒక లీటర్ ద్రవ రూపంలో ట్రైకోడెర్మావిడిని పొరలు పొరలుగా చల్లాలి. దీనిపై 1కి. బెల్లాన్ని కలిపిన నీటిని, పశువుల ఎరువుపై చల్లాలి. బెడ్ తేమగా వుండే విధంగా నీరు చిలకరించాలి. తేమ ఆవిరికాకుండా దీనిపై గోనె పట్టాలు కప్పి ఉంచాలి. రోజూ నీరు చిలకరిస్తుంటే 7-10 రోజుల్లో ట్రైకోడెర్మా శిలీంద్రం.. ఎరువు మొత్తం వ్యాపిస్తుంది.
గోనె పట్టాను పైకి తీసినప్పుడు పశువుల ఎరువుపై తెల్లటి బూజు ఆక్రమించి వుండటం గమనించవచ్చు. ఈ సమయంలో దీన్ని పొలంలో తేమ ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. దీనివల్ల మొక్కల వేర్ల చుట్టూ, ట్రైకోడెర్మా శిలీంద్రం అభివృద్ధి చెంది, వేరుకుళ్లు తెగులు నుంచి పంటను రక్షిస్తుంది. దీన్ని రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే కనీసం 15 రోజుల వ్యవధి ఇవ్వాలి. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులతో కలిపి వాడవచ్చునని తెలిపారు.
Read Also :
Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Shreyas Iyer: డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్.. కానీ గాయపడ్డ అయ్యర్.. వీడియో
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

