సిడ్నీ : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీతో చెలరేగాడు. సిడ్నీ పిచ్‌పై శతకం బాదాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ చేశాడు. వన్డల్లో అతనికి ఇది 33వ సెంచరీ. 105 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో శర్మ సెంచరీ పూర్తి చేశాడు. 237 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్.. ఈజీగా విక్టరీ వైపు వెళ్తోంది. రోహిత్, కోహ్లీ అజేయంగా రెండో వికెట్‌కు 100 పైగా రన్స్ జోడించారు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్, ఇక మూడో వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. వీలైన సందర్భంలో సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు.
𝐇.𝐔.𝐍.𝐃.𝐑.𝐄.𝐃. 💯
Take a bow, Rohit Sharma! 🙇♂
ODI century no. 3️⃣3️⃣ for the #TeamIndia opener👏
Updates ▶ https://t.co/omEdJjQOBf#AUSvIND | @ImRo45 pic.twitter.com/vTrIwKzUDO
— BCCI (@BCCI) October 25, 2025