సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ అర్థశతకం చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 60వ హాఫ్ సెంచరీ. 63 బంతుల్లో ఆరు బౌండరీలు, ఓ సిక్సర్ తో అర్థ శతకం పూర్తి చేశాడు. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్‌కు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. వాస్తవానికి తొలి వన్డేలో కేవలం 8 రన్స్‌కే ఔటయ్యాడు. కానీ అడిలైడ్ వన్డేలో అతను 73 రన్స్ చేశాడు.
ఇక సిడ్నీ వన్డేలో ఇండియా విక్టరీ దిశగా దూసుకెళ్తున్నది. స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా .. తాజా సమాచారం ప్రకారం 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 141 రన్స్ చేసింది. తొలి వికెట్‌కు రోహిత్, గిల్ 69 రన్స్ జోడించారు. కెప్టెన్ గిల్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం రెండో వికెట్‌కు రోహిత్, కోహ్లీలు అజేయంగా 72 రన్స్ జోడించారు.
Consecutive half-centuries for @ImRo45 here in Australia 👏👏
He brings up his 60th ODI FIFTY in 63 deliveries.
Live – https://t.co/nnAXESYYUk #TeamIndia #AUSvIND #3rdODI pic.twitter.com/zEYGzZ8rIK
— BCCI (@BCCI) October 25, 2025