IND vs AUS : భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా మరింత కష్టాల్లో పడింది. మార్నస్ లబూషేన్(39)ను ఔటయ్యాడు. అశ్విన్ ఓవర్లో అతడిని రాహుల్ స్టంపౌట్ చేశాడు. దాంతో, 157 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కామెరూన్ గ్రీన్(19నాటౌట్), జోష్ ఇంగ్లిస్(2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 34 ఓవర్లకు స్కోర్.. 163-4.
లబూషేన్, గ్రీన్ నాలుగో వికెట్‌కు 35 రన్స్ జోడించారు. అంతుకముందు జడేజా(Jadeja) ఓవర్లో రనౌట్ తప్పించుకున్న గ్రీన్ ఓపికగా ఆడుతున్నాడు.
Ashwin gets the big wicket of Labuschagne.
Marnus Labuschagne plays a reverse sweep but does not get the connection on it, the ball hits the pads of KL Rahul and goes on to hit the stumps.
Live – https://t.co/H6OgLtww4N… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/TbEkkbcYgV
— BCCI (@BCCI) September 22, 2023
మొహాలీ స్టేడియంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ తీసుకుంది. అయితే.. 4 పరుగుల వద్దనే ఓపెనర్ మిచెల్ మార్ష్(4) వికెట్ తీసి షమీ ఆసీస్‌కు షాకిచ్చాడు. ఆ తర్వాత వార్నర్(520, స్మిత్(41) దూకుడుగా ఆడారు. వీళ్లు రెండో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. స్మిత్‌ను ఔట్ చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడదీశాడు.