Kylian Mbappe : క్లబ్ వరల్డ్ కప్ (Club World Cup)లో ఛాంపియన్‌గా నిలవాలనుకుంటున్న రియల్ మాడ్రిడ్ (Real Madrid) జట్టుకు పెద్ద షాక్. ఆ టీమ్ స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) మరొకొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. జ్వరం కారణంగా సౌదీ అరేబియా క్లబ్ అల్ హిలాల్‌తో జరిగిన మ్యాచ్ ఆడలేకపోయిన ఎంబాపే ఆస్పత్రి పాలయ్యాడు. పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడీ యంగస్టర్. ఎంబాపే ఆరోగ్యంపై కోచ్ గ్జాబీ అలొనే స్పందిస్తూ.. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం అని తెలిపాడు.
‘క్లబ్ వరల్డ్ కప్‌లో బుధవారం అల్ హిలాల్‌తో తొలి మ్యాచ్‌లో జ్వరం కారణంగా ఎంబాపే ఆడలేదు. అయితే.. ఆ తర్వాత అతడు పొట్టలో ఇన్ఫెక్షన్తో బాధ పడ్డాడు. వాంతులు, డయేరియా వంటి లక్షణాలు ఉండడంతో, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. పచుకా టీమ్‌తో జరిగే మ్యాచ్‌కు ఎంబాపే అందుబాటులో ఉంటాడనే నమ్మకం ఉంది’ అని అలొనే వెల్లడించాడు.
Kylian Mbappé has been diagnosed with acute gastroenteritis and has been hospitalized for various tests and treatment, Real Madrid announced. pic.twitter.com/Eq4wGwU988
— ESPN FC (@ESPNFC) June 19, 2025
.
మూడేళ్ల క్రితం ఫిఫా వరల్డ్ కప్‌లో నుంచి ఎంబాపే సూపర్ స్టార్‌గా మారాడు. అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో ఫ్రాన్స్‌ను గెలుపువాకిట నిలిపాడీ యువకెరటం. ఈ ఏడాది ఆరంభంలో రియల్ మాడ్రిడ్‌తో ఒప్పందం చేసుకున్న ఎంబాపే.. క్లబ్ వరల్డ్ కప్‌లో చెలరేగాలని అనుకున్నాడు. ఇంటర్ మియామికి ఆడుతున్న లియోనల్ మెస్సీ (Lionel Messi) తర్వాత ఈ లీగ్‌లో సూపర్ స్టార్ తనే.
దాంతో, అతడి గోల్ విన్యాసాలు చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్ల కొన్నారు. కానీ.. జ్వరం, పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా అతడు మైదానంలో దిగేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. ఈ సీజన్లో ఎంబాపే జట్టుకు దూరమవ్వడం ఇది రెండోసారి. యూరోపియన్ కప్‌లో ముక్కుకు బలమైన గాయం కావడంతో విశ్రాంతి తీసుకున్నాడు.