India Open Super 750: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ రెండో రౌండ్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. గురువారం పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లలో భాగంగా.. వరల్డ్ ఛాంపియన్ కున్లావత్ వితిదర్సన్, ఆల్ ఇంగ్లండ్ విన్నర్ లి షి ఫెంగ్లు రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌గా ఉన్న థాయ్‌లాండ్ ప్లేయర్ కున్లావత్.. 21-16, 20-22, 21-23 తేడాతో హాంకాంగ్‌కు చెందిన లీ చెక్ యీ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రౌండ్ నెగ్గిన కున్లావత్.. ఆ తర్వాత వెనుకబడ్డాడు.
మ్యాచ్ ముగిశాక కున్లావత్ స్పందిస్తూ.. ‘ఈరోజు నేను ఆడిన ఆట ఉత్తమ ప్రదర్శన అయితే కాదు. చివరి సెట్లో చాలా ఒత్తిడికి లోనయ్యా. దీంతో నా ఆటపై నియంత్రణ కోల్పోవాల్సి వచ్చిందిన. నా ప్రత్యర్థి నాకంటే చాలా మెరుగ్గా ఆడాడు. ప్రతి టోర్నీ నుంచి నేను ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటా. కానీ ఇప్పటికీ కొన్ని ప్రెజర్ సిట్యూయేషన్స్లో మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. మిగతావాళ్ల గురించి ఆలోచించకుండా నేను, నా ఆటపై పూర్తి దృష్టి సారించాలి..’ అని అన్నాడు.
TWO BIG UPSETS 💥
Lee Cheuk Yiu 🇭🇰 beat Reigning world and defending #YonexSunriseIndiaOpen champion Kunlavut Vitidsarn 🇹🇭 and Koki Watanabe 🇯🇵 got past 2023 All England champion Li Shi Feng 🇨🇳 to enter quarters ✅#IndiaKaSmashMania#BWFWorldTourSuper750#IndiaontheRise pic.twitter.com/XNLic82y1M
— BAI Media (@BAI_Media) January 18, 2024
మరో మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్, మూడో సీడ్ లి షి ఫెంగ్ (చైనా) 14-21, 21-13, 9-21 తేడాతో జపాన్‌కు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ కోకి వటనబె చేతిలో ఓడిపోయాడు. నేడు సాయంత్రం భారత ఆటగాళ్లు హెచ్ఎస్ ప్రణయ్.. ప్రియాన్షు రజావత్ మధ్య పోరు జరగాల్సి ఉంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ – చిరాగ్‌లు.. యంగ్ – లూ (తైవాన్) జోడీతో తలపడనున్నారు.