యాదాద్రి భువనగిరి : మదర్ డెయిరీ ( Mother Dairy ) చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy ) తన పదవికి రాజీనామా ( Resign ) చేశారు.ఇటీవల చైర్మన్‌కు వ్యతిరేకంగా 11మంది అధికార, ప్రతిపక్ష డైరెక్టర్లు డెయిరీని నడపడంలో విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాకు తేదీని ఖరారు చేశారు.
రాజీనామా గడువు గురువారంతో ముగియడంతో మరోసారి మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్మన్ రాజీనామాకు డైరెక్టర్లు పట్టుబట్టారు. దీంతో చివరకు రాజీనామా అంగీకారం తెలిపారు. ఆయన రాజీనామాను బోర్డు అనుమతించాల్సి ఉంది. బోర్డు కొత్త చైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి రేస్‌లో ఉన్నట్లు సమాచారం.