Anil Kumble : టెస్టు సారథిగా భారత జట్టుపై చెరగని ముద్ర వేశారు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli). అలాంటి ఈ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు కు వీడ్కోలు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఇకపై వన్డేల్లో మాత్రమే రోహిత్, కోహ్లీ టీమిండియా జెర్సీ వేసుకోనున్నారు. తమ ఆటతో, నాయకత్వ పటిమతో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన రోకోకు ఘనమైన వీడ్కోలు పలకాలని ఘనమైన వీడ్కోలు పలకాలని మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) అభిప్రాయపడ్డాడు. దిగ్గజ ఆటగాళ్లు అయిన కోహ్లీ, రోహిత్‌లను తగిన విధంగా గౌరవించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.
‘రోహిత్ శర్మ రిటైరైన కొన్ని రోజులకే విరాట్ కూడా అతడిని అనుసరించాడు. భారత జట్టుకు విశేష సేవలందించిన ఇద్దరికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. దిగ్గజ ఆటగాళ్లు అయిన వీళ్లను బీసీసీఐ సముచితంగా గౌరవించాలి. ఫేర్వెల్ మ్యాచ్ ఆడించాలి. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్లు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలపండి’ అని కుంబ్లే పిలుపునిచ్చాడు.
It’s official – the end of an era.
Rohit Sharma & Virat Kohli retire together from both T20 & Test formats. 🇮🇳Indian cricket will miss them dearly, and no one can replace their legacy. 🙌#ViratKohli | #RohitSharma | #TestCricket pic.twitter.com/Hkn3lXOFFp
— Indian Cricket Team (@incricketteam) May 12, 2025
అంతేకాదు మ్యాచ్ విన్నర్లు అయిన కోహ్లీ, రోహిత్ గైర్హాజరీలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో సవాళ్లు ఎదురవుతాయని కుంబ్లే చెప్పాడు. 5 టెస్టుల సిరీస్‌కు స్క్వాడ్ ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పి కానుంది. కుర్రాళ్లతో అద్భుతాలు చేయడం సాధ్యమేనా అనేది తెలియాల్సి ఉంది అని ఈ వెటరన్ స్పిన్నర్ తెలిపాడు.
జూన్‌లో కీలకమైన ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ, హిట్‌మ్యాన్ ఆడుతారని అందరూ ఊహించారు. కానీ, నిరుడు న్యూజిలాండ్, ఆపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు వైఫల్యం కారణంగా రోహిత్‌పై వేటు ఖాయమనే వార్తలు వినిపించాయి. దాంతో, తనను కెప్టెన్‌గా తప్పిస్తారని తెలిసిన అతడు మే 7న టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో.. ‘కోహ్లీ ఉన్నాడులే.. ఇంగ్లండ్ సిరీస్‌లో కుర్రాళ్లకు పెద్దన్నలా వ్యవహరిస్తాడు’ అని
సెలెక్టర్లు భావించారు.
Legendary India spinner Anil Kumble feels star batters Virat Kohli and Rohit Sharma deserved a proper farewell as they retire from Test cricket.
“Right now, Rohit Sharma a few days ago and then Virat Kohli. I think all three of them deserved a proper send off on the field. I… pic.twitter.com/EQGOAFUoUn
— IndiaToday (@IndiaToday) May 13, 2025
కానీ, విరాట్ సైతం బాంబ్ పేల్చాడు. బీసీసీఐ వారించినా వినకుండా తనకెంతో ఇష్టమైన టెస్టులకు మే 12న టాటా చెప్పాడు. దాంతో, ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ మినహా పెద్ద స్కోర్లు చేయని కోహ్లీ.. ఇంగ్లండ్ సిరీస్‌లో తనను తాను నిరూపించుకుంటాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. అనుభవజ్ఞులైన ఈ ఇద్దరూ లేకపోవడంతో ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు విజయాలపై ప్రభావం చూపుడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.