Kuldeep Yadav | భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశిక (Vanshika)ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వీరి ఎంగేజ్మెంట్ (engagement) ఘనంగా జరిగింది. లఖ్నోలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. ఇక వీరి వివాహం త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.
टीम इंडिया के स्टार क्रिकेटर और चाइनामैन गेंदबाज कुलदीप यादव ने अपनी बचपन की दोस्त से सगाई कर ली है.
कुलदीप और उनकी बचपन की दोस्त वंशिका के साथ सगाई की बहुत-बहुत बधाई एवं शुभकामनाएं।#KuldeepYadav #kuldeepyadavengagement #vanshika pic.twitter.com/zylfGDfnow— Priyanshu Modanwal – Samajwadi (@modanwalA2Y) June 4, 2025
కాగా, కుల్దీప్ యాదవ్, వంశిక చిన్ననాటి స్నేహితులు. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీంతో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది. వంశిక ప్రస్తుతం ఎల్ఐసీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కుల్దీప్ ఎంపికైన విషయం తెలిసిందే.
Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika. (Abhishek Tripathi).
– Many congratulations to them. ❤️ pic.twitter.com/fdTncdtYa4
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
Also Read..
Bike Stunts | బస్సుకు అడ్డంగా బైక్‌తో స్టంట్లు.. బస్సు డ్రైవర్ ఏం చేశాడంటే??
తత్కాల్ బుకింగ్ సిస్టమ్ ఓ స్కామ్!
2027లో జనగణన.. 16 ఏండ్ల తర్వాత జనాభా లెక్కలు