Asain Championships 2025 : ఆసియా ఛాంపియన్షిప్ పోటీలకు సిద్ధమవుతున్న భారత అథ్లెట్లకు గుడ్ న్యూస్. మరో ఐదు రోజుల్లో టోర్నీ ఆరంభం కానుందనగా భారత బృందంలోని 25 మందికి ఎట్టకేలకు దక్షిణ కొరియా (South Korea) ప్రభుత్వం వీసా మంజూరు చేసింది. దాంతో, వాళ్లు కూడా స్క్వాడ్‌తో కలిసి పతకాల వేటలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
‘భారత క్రీడల మంత్రిత్వ శాఖ, కొరియాలోని భారత దౌత్యవేత్తల ప్రయత్నం ఫలించింది. స్క్వాడ్‌లో మిగిలిన 25 మందికి గురువారం సాయంత్రం వీసాలు మంజూరు అయ్యాయి’ అని ఏఎఫ్ఐ సెక్రటరీ జనరల్ సందీప్ మెహతా (Sandeep Mehta) మీడియాకు వెల్లడించాడు. ‘వీసా కష్టాలు తొలగడంతో బ్యాచ్‌ల వారీగా అథ్లెట్లు కొరియాలోని గుమి చేరుకుంటారు. ప్రస్తుతం తిరువనంతపురంలోని శిక్షణ కేంద్రంలో ఉన్న భారత అథ్లెట్లు కొరియాకు బయల్దేరనున్నారు. బెంగళూరు, ముంబై, పాటియాలా ట్రైనింగ్ సెంటర్లలో ఉన్నవాళ్లు ముంబై, ఢిల్లీ నుంచి కొరియా వెళ్లుతార’ని ఏఎఫ్ఐ (AFI) తెలిపింది.
1st batch of Indian team ready to take off from Trivandrum to Gumi for Asian Athletics Championships starting May 27.#indianathletics #SouthKorea #Athletics pic.twitter.com/0NuaCR70pQ
— Athletics Federation of India (@afiindia) May 22, 2025
ఆసియాలోనే అతిపెద్ద క్రీడా సమరమైన ఈ ఛాంపియన్షిప్ కోసం భారత అథ్లెట్ల సమాఖ్య 59 మందిని ఎంపిక చేసింది. కొరొయాలోని గుమిలో మే 27 న ఈ టోర్నీ షురూ కానుంది. నాలుగు రోజుల పాటు అంటే.. 31 వరకూ జరుగనుంది. అయితే.. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) మాత్రం ఈ టోర్నీకి దూరం కానున్నాడు.
నీరజ్ చోప్రా
దోహా డైమండ్ లీగ్, అనంతరం టోక్యోలో వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల దృష్ట్యా ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈ పోటీల్లో పాల్గొనడం లేదు. రెండేళ్ల క్రితం జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్లు 27 పతకాలతో మెరిశారు. 16 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలతో మూడో స్థానం సాధించింది టీమిండియా.