IPL 2025 : ఐపీఎల్లో విధ్వసంక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న మిచెల్ మార్ష్ (117) తొలి శతకం సాధించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఉతికారేసిన ఈ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఓపెనర్ సెంచరీ సాధించాడు. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన మార్ష్ ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి మూడంకెల స్కోర్‌కు చేరువయ్యాడు.
ఈ చిచ్చరపిడుగు 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసక శతకం నమోదు చేశాడు. పవర్ తర్వాత టాప్ గేర్‌లో ఆడిన ఈ పవర్ హిట్టర్ ఐపీఎల్ చరిత్రలో లక్నో తరఫున వంద కొట్టిన నాలుగో బ్యాటర్‌గా మార్ష్ రికార్డు నెలకొల్పాడు. క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కేఎల్ రాహుల్(KL Rahul)లు అతడి కంటే ముందున్నారు.
𝙀𝙭𝙝𝙞𝙗𝙞𝙩𝙞𝙤𝙣 𝙤𝙛 𝙗𝙧𝙪𝙩𝙚 𝙛𝙤𝙧𝙘𝙚 💥
Maiden #TATAIPL 1️⃣0️⃣0️⃣ for Mitchell Marsh 👏
He continues to look unstoppable tonight 🙅♂#GTvLSG pic.twitter.com/NiYk9V0HgT
— IndianPremierLeague (@IPL) May 22, 2025
మిచెల్ మార్ష్ మెరుపులతో చేసుకోవడంతో లక్నో భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. మరో ఎండ్‌లో నికోలసన్ పూరన్(50) సైతం వీరకొట్టుడు కొడుతున్నాడు. సిక్సర్లతో విరుచుకుపడుతున్న పూరన్ కూడా హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. 17 ఓవర్లకు లక్నో స్కోర్.. 194-1. అనంతరం ప్రసిధ్ ఓవర్లో పూరన్ అర్ధ శతకం సాధించగా లక్నో18 ఓవర్లకే 200ల మార్క్ అందుకుంది.