IPL 2025 : సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్ సాయి సుదర్శన్ (21) త్వరగానే పెవిలియన్ చేరినా.. శుభ్‌మన్ గిల్(24 నాటౌట్), జోస్ బట్లర్(20 నాటౌట్)లు ఉతికేస్తున్నారు. ఆకాశ్ సింగ్ ఓవర్లో గిల్ హ్యాట్రిక్ ఫోర్లు బాదగా.. ఇక తనవంతు అన్నట్లు బట్లర్ చెలరేగాడు. అవేశ్ ఖాన్ వేసిన 6వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాది 21 రన్స్ రాబట్టాడు. దాంతో, గుజరాత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
భారీ ఛేదనను ధాటిగా ఆరంభించిన గుజరాత్‌కు షాక్. డేంజరస్ ఓపెనర్ సాయి సుదర్శన్(21) ఔటయ్యాడు. ఆకాశ్ దీప్ ఓవర్లో ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. చివరకు విలియం ఓ రూర్కీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సాయి మిడాన్ దిశగా ఆడిన బంతిని అక్కడే కొచుకొని ఉన్న హిమ్మత్ సింగ్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 46 వద్ద వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది.
Roaring response to the chase 🔥
The #GT openers mean business 👊
Updates ▶ https://t.co/NwAHcYJT2n #TATAIPL | #GTvLSG pic.twitter.com/RQaY3T6xPf
— IndianPremierLeague (@IPL) May 22, 2025
తొలుత ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ కొండంత స్కోర్ చేసింది. నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఓపెనర్ మిచెల్ మార్ష్(117) శతకంతో గర్జించాడు. ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేసిన అతడు నికోలస్ పూరన్(56 నాటౌట్) జతగా మరింత రెచ్చిపోయాడు. మెరుపు అర్ద శతకం బాదిన పూరన్ .. రెండో వికెట్‌కు 121 రన్స్ సాధించి లక్నో స్కోర్ 200 దాటించాడు. మార్ష్ ఔటయ్యాక కెప్టెన్ రిషభ్ పంత్(16 నాటౌట్) సైతం ధనాధన్ ఆడాడు. దాంతో, లక్నో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగలు చేసింది.
మార్ష్(117), పూరన్(56 నాటౌట్)