EV Bus | హైదరాబాదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. నగరానికి కొత్తగా 2వేల ఎలక్ట్రిక్ బస్సులు..!
EV Bus | హైదరాబాద్ వాసులకు కేంద్రం తీపికబురు చెప్పింది. నగరానికి పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2వేల బస్‌లను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కీల నిర్ణయం తీసుకున్నారు.
EV Bus | హైదరాబాద్ వాసులకు కేంద్రం తీపికబురు చెప్పింది. నగరానికి పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2వేల బస్‌లను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కీల నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించారు.
పథకంలో భాగంగా బెంగళూరుకు సుమారు 4,500 బస్సులు, ఢిల్లీకి 2,800, హైదరాబాద్‌కు 2వేలు, అహ్మదాబాద్‌కు వెయ్యి, సూరత్‌కు 600 బస్సులు అందించనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సుస్థిర పట్టణ రవాణా దిశగా అడుగులు వేస్తోందన్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు, నగరాలు ప్రజారవాణాను మరింత పరిశుభ్రంగా, సమర్థవంతంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులను చురుగ్గా స్వీకరిస్తున్నాయని.. తాము కేవలం ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడమే కాకుండా కొత్త ఆవిష్కరణలు, పర్యావరణ స్పృహతో భారత రవాణా వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పీఎం ఈ-డ్రైవ్ హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కుమారస్వామి తెలిపారు. పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2026 వరకు రెండేళ్ల కాలంలో రూ.10,900 కోట్ల ఆర్థిక వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద డిమాండ్ ఇన్సెంటివ్ను పొందేందుకు ఈవీ కొనుగోలుదారులకు ఈ-వోచర్స్‌ను సైతం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కుల కోసం చెరో రూ.500 కోట్లు కేటాయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

