IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్ కొండంత స్కోర్ చేసింది. నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ ఓపెనర్ మిచెల్ మార్ష్(117) శతకంతో గర్జించాడు. ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేసిన అతడు నికోలస్ పూరన్(56 నాటౌట్) జతగా మరింత రెచ్చిపోయాడు. మెరుపు అర్ద శతకం బాదిన పూరన్ .. రెండో వికెట్‌కు 121 రన్స్ సాధించి లక్నో స్కోర్ 200 దాటించాడు. మార్ష్ ఔటయ్యాక కెప్టెన్ రిషభ్ పంత్(16 నాటౌట్) సైతం ధనాధన్ ఆడాడు. దాంతో, లక్నో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగలు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్(51), ఎడెన్ మర్క్రమ్(36)లు అదిరే ఆరంభమిచ్చారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఈ జోడీ గుజరాత్ పేసర్లను ఒత్తిడిలోకి నెట్టింది. అర్షద్ ఖాన్ వేసిన 6వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మర్క్రమ్ స్కోర్ 50 దాటించాడు. ఆ కాసేపటికే మార్ష్.. సాయి కిశోర్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు.
Innings Break!
Showmanship from the #LSG batters helps them post a commendable total of 235/2 on the board. 🔥#GT‘s chase on the other side.
Scorecard ▶ https://t.co/NwAHcYJT2n #TATAIPL | #GTvLSG pic.twitter.com/Y2LhcAbAQs
— IndianPremierLeague (@IPL) May 22, 2025
శతక భాగస్వామ్యం నెలకొల్పేలా కనిపించిన ఓపెనింగ్ ద్వయాన్ని సాయికిశోర్ విడదీశాడు. చివరి బంతికి మర్క్రమ్ను ఔట్ చేసి గుజరాత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. మర్క్రమ్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద షారుక్ ఖాన్ క్యాచ్ పట్టడంతో 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(56 నాటౌట్) చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, లక్నో 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
మిడిల్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లను విసిగించిన పూరన్, మార్ష్ ఎడాపెడా బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించారు. సిరాజ్ వేసిన ఓవర్లో పూరన్ 4, 4, 6, 4 బాది..18 పరుగులు పిండుకున్నాడు. 94 మీదున్న అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన మార్ష్ ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి మూడంకెల స్కోర్‌కు చేరువయ్యాడు. ఈ చిచ్చరపిడుగు 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసక శతకం నమోదు చేశాడు.
𝙈inimum effort, 𝙈aximum entertainment 😎🍿
First overseas batter to score a century this season ✅
Mitchell Marsh departs after an outstanding 117(64) 👏
Updates ▶ https://t.co/NwAHcYJlcP #TATAIPL | #GTvLSG pic.twitter.com/CEZCzb9WNq
— IndianPremierLeague (@IPL) May 22, 2025
కాసేపటికే పూరన్ అర్ధ శతకం సాధించగా లక్నో18 ఓవర్లకే 200ల మార్క్ అందుకుంది. 121 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని అర్షద్ ఖాన్ విడదీశాడు. అయినా సరే పూరన్, రిషభ్ పంత్(16 నాటౌట్)లు సిక్సర్ల మోత మోగించారు. దాంతో, లక్నో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.