IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. చిన్నస్వామిలో జరగాల్సిన ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్ రద్దుతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టోర్నీ నుంచి నిష్క్రమించింది. వర్షం కారణంగా కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యంకాకపోవడంతో.. రహానే బృందం నిరాశలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తతుం ఆరుజట్లు మాత్రమే రేసులో ఉన్నాయి. రేపు జరుగబోయే డబుల్ హెడర్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు ఒకవేళ ఓడిపోతే.. రజత్ పాటిదార్ బృందం నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.
కోల్‌కతా నిష్క్రమణతో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్‌లతో పాటు ముంబై ఇండియన్స్ (Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రేసులో ఉన్నాయి. రేపు రాజస్థాన్ రాయల్స్ గనుక పంజాబ్‌కు షాకిచ్చినా.. ఢిల్లీని గుజరాత్ ఓడించినా ఆర్సీబీ నేరుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. టాప్‌లో ఉన్న గుజరాత్ కూడా 18 పాయింట్లతో బెర్తు సాధిస్తుంది. అప్పుడు మిగిలిన రెండు స్థానాల కోసం ముంబై, లక్నో, ఢిల్లీ, పంజాబ్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంటుంది.
Match abandoned due to rain 💔
Next stop: Delhi, to take on Sunrisers Hyderabad. pic.twitter.com/NZJ8Twfy68
— KolkataKnightRiders (@KKRiders) May 17, 2025
అప్పుడు మే 21న వాంఖడేలో ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్ ముంబైకి కీలకం అవుతుంది. ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసిన హార్దిక్ పాండ్యా సేన.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో ఉంటుంది. ఇక.. 10 పాయింట్లతో ఉన్న లక్నో మిగతా మూడు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది. ముంబై రెండు మ్యాచుల్లో ఓడిపోతే.. లక్నోకు కలిసి వస్తుంది. సో.. రేపటి డబుల్ హెడర్ ఫలితాలతో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.
Match 5️⃣8️⃣ between @RCBTweets and @KKRiders has been called off due to rain.
Both teams get a point each.#TATAIPL | #RCBvKKR pic.twitter.com/igRYRT8U5R
— IndianPremierLeague (@IPL) May 17, 2025
ప్లే ఆఫ్స్ చేరాలనుకున్న కోల్‌కతా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. 1023 గంటలకు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు, మ్యాచ్ రిఫరీ .. తడి ఔట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చి.. ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో, మరొక మ్యాచ్‌కు ముందే అజింక్యా రహానే బృందం ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. సొంత గడ్డపై గెలుపొంది ప్లే ఆఫ్స్ చేరాలనుకున్న ఆర్సీబీ మరొక మ్యాచ్ వరకూ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.