IND vs NZ : నిర్ణయాత్మక మూడో వన్డేల్లో విరాట్ కోహ్లీ(124) సెంచరీతో గర్జించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇండోర్‌లో 338 పరుగుల ఛేదనలో ఒంటరి సైనికుడిలా పోరాడిన విరాట్‌కు హర్షిత్ రానా(52) అండగా నిలిచాడు. కానీ, రానా ఔటయ్యాక వరుసగా రెండు ఫోర్లు బాదిన కోహ్లీ.. 46వ ఓవర్ నాలుగో బంతికి వెనుదిరిగాడు. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడంతో న్యూజిలాండ్ 41 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత గడ్డపై ఆ జట్టుకు ఇదే మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.
భారత జట్టును స్వదేశంలో ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే. కానీ, న్యూజిలాండ్ రెండోసారి సిరీస్ విజయంతో మేమున్నామని నిరూపించింది. రెండేళ్ల క్రితం టెస్టు సిరీస్ పట్టేసిన కివీస్.. ఈసారి వన్డే సిరీస్‌నూ ఒడిసిపట్టింది. ఇండోర్‌లో ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో టీమిండియాపై 41 పరుగుల తేడాతో గెలుపొందింది బ్లాక్‌క్యాప్స్. భారీ ఛేదనలో విజయం దోబూచులాడిన పోరులో విరాట్ కోహ్లీ(124) భారత్‌ను గెలిపించేందుకు చివరిదాకా పోరాడాడు. కానీ, హర్షిత్ రానా(52) వికెట్ పడడంతో.. కోహ్లీ వేగంగా ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. అతడు ఔటైన మరో రెండు బంతులకే ఇండియా ఆలౌటైంది. 2-1తో కివీస్ వన్డే సిరీస్ విజేతగా నిలిచింది.
New Zealand register a 41-run victory in the decider and win the series 2-1
Scorecard ▶️ https://t.co/KR2ertVUf5#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/JuuARZ4y53
— BCCI (@BCCI) January 18, 2026
న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ఛేదనను టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(23) దూకుడగా ఆరంభించారు. కానీ, రోహిత్ మరోసారి స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన కెప్టెన్ గిల్‌ను జేమీసన్ బౌల్డ్ చేశాడు. దాంతో, పవర్ ప్లేలోనే 45కే ఓపెనర్లు ఔటయ్యారు. పెద్ద షాట్‌కు యత్నించిన శ్రేయాస్ అయ్యర్(3) మిడాఫ్లోనే క్యాచ్ ఇవ్వగా.. కేఎల్ రాహుల్(1) సైతం స్పిన్నర్ లెనాక్స్ బౌలింగ్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి(53).. హర్షిత్ రానా(52)లుతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు కోహ్లీ. రానా సిక్సర్లతో చెలరేగి తొలిఅర్ధశతకం సాధించాడు. విజయానికి 61 రన్స్ అవసరమైన వేళ.. డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
Records keep tumbling 👑@imVkohli | #TeamIndia | #INDvNZ pic.twitter.com/NPmNWWlDnG
— BCCI (@BCCI) January 18, 2026
ఆ తర్వాత బంతికే సిరాజ్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. దాంతో.. ఐదు ఓవర్లలో.. 54 రన్స్ అవసరమయ్యాయి. కానీ, రానా ఔటయ్యాక కోహ్లీ గేర్ మార్చాల్సి వచ్చింది. అయితే.. ధాటిగా ఆడే క్రమంలో అతడు బౌండరీ వద్ద మిచెల్ చేతికి చిక్కాడు. అంతే.. మ్యాచ్ చేజారింది. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు త్రోకు కుల్దీప్ రనౌట్ కావడంతో 46 ఓవర్లో 296కే టీమిండియా కుప్పకూలింది.
నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు దంచేశారు. 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనుకున్న భారత బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) కొండంత స్కోర్ అందించారు. క్రీజులో కుదురుకున్న ఈ ద్వయం మిడిల్ ఓవర్లలో ఎడాపెడా ఫోర్లు, చెలరేగి స్కోర్ బోర్డును ఉరికించింది. సెంచరీ తర్వాత ఇద్దరూ ఔట్ కావడంతో స్కోర్ వేగం తక్కింది. ఆఖర్లో కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్(28 నాటౌట్) ధనాధన్ ఆటతో స్కోర్ 330 దాటించాడు. దాంతో, టీమిండియాకు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.