IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో విజయంతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్‌లో పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకార విక్టరీ సాధించింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ(73 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(61)లు అర్ధ శతకాలతో విజృంభించగా.. చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన దారుణ ఓటమికి రెండు రోజుల వ్యవధిలోనే బదులు తీర్చుకుంది రజత్ పాటిదార్ బృందం.
మ్యాచ్ ఆసాంతం దూకుడుగా కనిపించిన విరాట్ 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జితేశ్ శర్మ(11 నాటౌట్) సిక్సర్‌తో ఆర్సీబీ విజయం సాధించగానే కోహ్లీ.. వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ వైపు చూస్తూ.. ‘మేము గెలిచాం.. ప్రతీకారం తీర్చుకున్నాం’ అనే విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాడు. బ్యాటుపై పంచ్ విసురుతూ.. కుడిచేతిని జోష్‌గా ఊపుతూ అయ్యర్‌ను ఉడికించాడు విరాట్. ఆ తర్వాత నవ్వుతూ అయ్యర్ దగ్గరకు వెళ్లి సరదాగా మాట్లాడాడు. ప్రస్తుతం విరాట్ యానిమేటెడ్ సెలబ్రేషన్ వీడియో నెట్టింట వైరలవుతోంది.
Virat kohli celebration after win against Punjab 😂 . He is sledging shreyas iyer 😭#PBKSvsRCB #RCBVSPBKS pic.twitter.com/MOqEEvTB8q
— Ashish (@Ashish_2__) April 20, 2025
ఏప్రిల్ 18న చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ 95 పరుగులకే పరిమితమైంది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో బెంగళూరు టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైంది. అయితే.. చిచ్చరపిడుగు టిమ్ డేవిడ్(50 నాటౌట్) మెరుపులతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అనంతరం
స్వల్ప లక్ష్యాన్ని మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది పంజాబ్.
R E M O N T A D A. 🥶
Nailed the reverse fixture. 2 very crucial points! 👊 pic.twitter.com/uTxdOWVi9k
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 20, 2025
సొంత మైదానంలో దారుణంగా ఓడిన ఆర్సీబీ.. ముల్లనూర్‌లో రెచ్చిపోయింది. ఆద్యంతం కసిగా ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు.. సిన్నర్లు ఆయుశ్ శర్మ(2-26), కృనాల్ పాండ్యా(2-25)లు తిప్పేయడంతో పంజాబ్‌ను 157కే కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో కోహ్లీ(73) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు. దేవ్‌దత్ పడిక్కల్(61) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ 18.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. ఐదో విక్టరీతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది.