ADHD | ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎంత వ్యాయామం చేసినా ఆరోగ్యకరమైన జీవన విధానం పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాలను తింటున్నా రోగాలు అనేవి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మనకు కొత్త కొత్త జబ్బులు వ్యాప్తి చెందుతున్నాయి. జనాభా పెరిగిపోతుండడం, కాలుష్యం, ఇతర కారణాల వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కనుక వారికే అధికంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం చాలా మంది పిల్లలు ADHD అనే వ్యాధి బారిన పడుతున్నారని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ఇంతకీ అసలు ADHD అంటే ఏమిటి..? దీని బారిన పడితే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? దీనికి చికిత్స ఏమిటి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ADHD అంటే Attention deficit hyperactivity disorder. ఈ సమస్య పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంటుంది. కానీ ప్రస్తుతం కొందరు పెద్దల్లోనూ ఈ సమస్య వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో సైంటిస్టులు దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ADHD అనేది ఒక మానసిక వ్యాధి. తీవ్రమైన నిరాశ, డిప్రెషన్లో ఉన్నవారికి ఇది వస్తుంది. పిల్లలకు కొందరికి పుట్టుకతోనే వస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలకు ADHD వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి పొగ తాగడం లేదా మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటివి చేసినా.. లేదా జన్యు సంబంధ కారణాల వల్ల కూడా పిల్లల్లో ADHD వస్తుంది. పెద్దల్లో అయితే తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించుకోకపోతే ఈ వ్యాధి వస్తుంది.
ADHD ఉన్నవారిలో పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎక్కువ సేపు కూర్చోలేరు. నిలబడలేరు. స్థిమితంగా ఉండలేరు. ఎల్లప్పుడూ పరధ్యానంలో ఉంటారు. ఏదో కోల్పోయినట్లు కనిపిస్తారు. కొన్ని సెకన్లలోనే ప్రవర్తన మారుతుంది. ఏ పని చేయలేకపోతుంటారు. ఏకాగ్రత అనేది ఉండదు. ఎదుటి వారు చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటారు. కొందరు ప్రతి విషయంలోనూ కంగారు పడతారు. గందరగోళంగా కూడా అనిపిస్తుంది. ఈ వ్యాధిలోనే మూడు రకాలు ఉంటాయి. ఒకటి హైపర్ యాక్టివ్ కాగా రెండోది ఇంపల్సివిటీ, మూడోది కేర్ లెస్ నెస్. ఈ వ్యాధి ఉన్నవారు ప్రతి విషయానికి అతిగా స్పందిస్తారు, ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు, ఆవేశ పడుతుంటారు, తొందరపాటుకు గురవుతుంటారు. దేన్నీ పట్టించుకోరు.
ADHD ఉన్నవారికి మానసిక వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తారు. అలాగే కొందరికి మెడిసిన్స్ కూడా వాడుతారు. ఈ రెండు చికిత్సా విధానాలు ప్రస్తుతం ADHDకి అందుబాటులో ఉన్నాయి. చిన్నారులకు అయితే కౌన్సిలింగ్ అవసరం లేదు. మెడిసిన్ వాడితే చాలు. కొందరికి మెడిసిన్ కూడా వాడాల్సి వస్తుంది. పెద్దలకు అయితే కచ్చితంగా మెడిసిన్‌తోపాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ADHD వ్యాధిని తగ్గించేందుకు సమయం పడుతుంది. కనుక కుటుంబ సభ్యులు ఈ వ్యాధితో బాధపడుతున్న వారి పట్ల సంయమనంతో ఉండాలి. వారు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా, బాధ పడకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూడాలి. దీంతో ఈ వ్యాధి నుంచి సులభంగా బయట పడతారు.