IPL 2025 : వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-25) వణికించినా.. రవీంద్ర జడేజా(53 నాటౌట్), హిట్టర్ శివం దూబే(50)లు అర్ధ శతకాలతో రెచ్చిపోయారు. టాపార్డర్ విఫలమైనా మిడిల్ ఓవర్లలో దంచికొట్టిన దూబే.. జడ్డూతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. డెత్ ఓవర్లలో జూలు విదిల్చిన జడేజా.. బౌల్డ్ బౌలింగ్‌లో 6, 4 బాదేసి హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. దాంతో, సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు అశ్వనీ కుమార్ షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే డేంజరస్ రచిన్ రవీంద్ర(5)ను ఔట్ చేసి ముంబైకి బ్రేకిచ్చాడు. అయితే.. అరంగేట్రం చేసిన ఆయుష్ మాత్రే(32) ఆ ఓవరలో వరుసగా 4, 6, 6 బాది తన తడాఖా చూపించాడు. దాంతో, చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది. ఆ తర్వాత చాహర్‌ను ఉతికేస్తూ రెండు ఫోర్లు సాధించిన మాత్రే.. పెద్ద షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద శాంట్నర్ చేతికి చిక్కాడు. ఆ కాసేపటికే శాంట్నర్ ఓవర్లో షేక్ రషీద్(19) ఫ్రంట్ ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు. చూస్తుండగానే చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(53 నాటౌట్)తో కలిసి శివం దూబే(50) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
𝙎𝙚𝙣𝙨𝙖𝙩𝙞𝙤𝙣𝙖𝙡 𝙎𝙝𝙞𝙫𝙖𝙢 🔥
Maiden FIFTY of the season for the hard-hitting Shivam Dube 💪
How well he can finish here for #CSK? 🤔
Updates ▶ https://t.co/v2k7Y5sIdi#TATAIPL | #MIvCSK pic.twitter.com/9RkMZbiZFm
— IndianPremierLeague (@IPL) April 20, 2025
నాలుగో వికెట్‌కు 79 రన్స్ జత చేసి చెన్నైని ఆదుకున్నాడు. అర్థ శతకంతో చెలరేగిన దూబే జట్టు స్కోర్ 140 దాటాక ఔటయ్యాడు. శాంట్నర్ తన ఆఖరి ఓవర్లో 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దాంతో, బుమ్రా వేసిన 19వ పెద్ద షాట్లు ఆడాలనుకున్న ఎంఎస్ ధోనీ(4) బ్యాక్వర్డ్ స్క్కేర్లెగ్లో కొట్టిన బంతిని తిలక్ వర్మ ఒడిసిపట్టుకున్నాడు. అంతే.. చెన్నై ఐదో వికెట్ పడింది. అనంతరం జేమీ ఓవర్టన్(4) ఓ బౌండరీ సాధించగా.. బౌల్ట్ వేసిన 20వ ఓవర్లో జడ్డూ లాంగాఫ్‌లో భారీ సిక్సర్, 4 బాది అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.