Virat Kohli | విరాట్ కోహ్లీ పక్కన పెట్టిన ఐదుగురు స్టార్ ప్లేయర్లు వీళ్లే.. విమర్శలు వచ్చినా తగ్గలేదుగా!
Virat Kohli : టీమిండియా(Team India) పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్‌గా జట్టుకు అపురూప విజయాలు అందించిపెట్టాడు. తన దూకుడు మంత్రతో జట్టును ముందుండి నడిపించాడు. జట్టు కోసం కఠిన నిర్ణయాలను తీసుకునే విషయంలోనూ కోహ్లీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. సీనియర్ ప్లేయర్లను కూడా అలవోకగా పక్కనపెట్టేశాడు. కోహ్లీ పక్కన పెట్టిన ఐదుగురు స్టార్ ప్లేయర్లు వీళ్లే...
Virat Kohli : టీమిండియా(Team India) పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్‌గా జట్టుకు అపురూప విజయాలు అందించిపెట్టాడు. తన దూకుడు మంత్రతో జట్టును ముందుండి నడిపించాడు. సారథిగానే కాకుండా బ్యాటర్‌గానూ పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలు కొట్టాడు. విరాట్ నాయకత్వంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) గెలవకున్నా అతడు గొప్ప కెప్టెన్ అన్న విషయాన్ని విస్మరించలేం. జట్టు కోసం కఠిన నిర్ణయాలను తీసుకునే విషయంలోనూ కోహ్లీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. సీనియర్ ప్లేయర్లను కూడా అలవోకగా పక్కనపెట్టేశాడు. ఈ క్రమంలో విమర్శలు వచ్చినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోహ్లీ పక్కన పెట్టిన ఐదుగురు స్టార్ ప్లేయర్లు వీళ్లే.
టెస్టుల్లో ఓపెనర్ అయిన రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ ఆర్డర్‌ను కోహ్లీ ఓసారి మార్చాడు. అతడిని నంబర్ త్రీలో పంపాడు. 2019లో విరాట్ మరో తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్‌ను వెస్టిండీస్ టూర్(West Indies Tour)లో ఏకంగా పక్కనపెట్టేశాడు. 2019 ప్రపంచ కప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్‌కు విండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో అందరూ షాకయ్యారు.

ఇద్దరి మధ్య విభేదాలే అందుకు కారణమనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చిన రోహిత్ ఓపెనర్‌గా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. రోహిత్ ఇప్పుడు టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
బెంచ్‌కే పరిమితమైన అశ్విన్
కోహ్లీ హయాంలోజట్టులో చోటు దక్కించుకోవడం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)కు గగనంగా మారింది. మరీ ముఖ్యంగా.. ఆసియాకు ఆవల జరిగే సిరీస్‌లలో అశ్విన్‌కు చోటు మృగ్యమైంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో అశ్విన్‌ను కోహ్లీ పక్కనపెట్టేశాడు.
కోహ్లీ, అశ్విన్

2017 చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అశ్విన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లోనూ అశ్విన్‌కు చోటు లభించలేదు. అంతేకాదు, 2017-2021 మధ్య అశ్విన్ ఒక్క వన్డే, టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.
నయావాల్‌కు ఝలక్
నయావాల్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) మిడిలార్డర్లో ఎంత విలువైన ఆటగాడో తెలిసిందే. క్రమం తప్పకుండా తుది జట్టులో చోటు దక్కించుకుంటున్న అతడిని కూడా కొన్ని మ్యాచ్‌ల్లో కోహ్లీ నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టేశాడు. 2014/15లో రోహిత్ శర్మ కోసం పుజారాను తప్పించారు.
కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా

ఆ తర్వాత 2016లో వెస్డిండీస్ సిరీస్‌లో అతను మళ్లీ జట్టులోకి వచ్చాడు. 2018లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పుజారాకు భారీ షాక్ తగిలింది. తుది జట్టులో ముగ్గురు ఓపెనర్లు ఉండడంతో పుజారాను పక్కనపెట్టిన కోహ్లీ.. కేఎల్ రాహుల్ (KL Rahul)ను మూడో స్థానంలో దింపాడు.
వైస్ కెప్టెన్‌పై వేటు
కోహ్లీ, జట్టు మేనేజ్మెంట్ 2017/18 సీజన్లో రోహిత్‌శర్మకు అండగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లకు అజింక్యా రహానే (Ajinkya Rahane)ను పక్కనపెట్టి రోహిత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. అప్పట్లో రహానే టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అయినప్పటికీ బెంచ్‌కు పరిమితం చేశారు. అయితే, హిట్‌మ్యాన్ ఫామ్ లేమి కొనసాగడంతో తిరిగి మూడో టెస్టులో రహానే జట్టులోకి వచ్చాడు.
యుజ్వేంద్ర చాహల్
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)ను కూడా కోహ్లీ పక్కనపెట్టాడు. 2021 ప్రపంచ కప్ జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ప్రకటించినప్పటికీ చాహల్ పేరు కనిపించలేదు. 2022 టీ20 ప్రపంచకప్‌లోనూ చాహల్‌కు నిరాశే ఎదురైంది.
యుజ్వేంద్ర చాహల్

మరోవైపు, ఐపీఎల్లో కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) 2021 తర్వాత చాహల్‌ను వదిలించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లెగ్ స్పిన్నర్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు.
ఇవి కూడా చదవండి
Nathan Lyon | బిగ్‌బాష్ లీగ్.. కొత్త జట్టుకు మారిన ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్
Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌లోకి ప్రణయ్, ప్రియాన్షు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

