Nathan Lyon | బిగ్‌బాష్ లీగ్.. కొత్త జట్టుకు మారిన ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్
Nathan Lyon : ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న అతను వచ్చే సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ (Melbourne Renegades) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆ జట్టుతో మూడేళ్ల కాలానికి ఈ టెస్టు స్పెషలిస్ట్ బౌలర్ ఒప్పందం చేసుకున్నాడు. అంటే..
Nathan Lyon : ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న అతను వచ్చే సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ (Melbourne Renegades) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆ జట్టుతో మూడేళ్ల కాలానికి ఈ టెస్టు స్పెషలిస్ట్ బౌలర్ ఒప్పందం చేసుకున్నాడు. అంటే.. 2025 -26 సీజన్ వరకూ లియాన్ మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుతో ఈ ఆఫ్ స్పిన్నర్ కొనసాగనున్నాడు. దాంతో, మూడుసార్లు చాంపియన్ సిడ్నీ సిక్సర్స్(Sydney Sixers)తో అతడి బంధానికి తెరపడింది.
‘మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో ఒకడిని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఆడం జంపాతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా’ అని లియానో ఓ ప్రకటనలో తెలిపాడు. లెగ్ స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa) కూడా మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు మారాడు. గత సీజన్లో అతను మెల్బోర్న్ స్టార్స్(Melbourne Stars) కెప్టెన్‌గా ఉన్నాడు.
ఆడం జంపా, లియాన్

యాషెస్ సిరీస్(Ashes Series) రెండో టెస్టు రెండో రోజు లియాన్ గాయపడ్డాడు. దాంతో, మరుసటి రోజు కర్రల సాయంతో నడుస్తూ కెమెరాల కంట చిక్కాడు. అయినా సరే కుంటుతూనే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పదో స్థానంలో క్రీజులోకి వచ్చిన అతను కాలు నొప్పిని భరిస్తూనే మిచెల్ స్టార్క్(Mitchell Starc)తో కలిసి విలువైన పరుగులు జోడించాడు.

అంతేకాదు ఒక బౌండరీ కూడా కొట్టాడు. ఆ తర్వాత రెండు టెస్టులకు అతడి ప్లేస్‌లో టాడ్ మర్ఫీ(Todd Murphy) జట్టులోకి వచ్చాడు. ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా 2-2తో పంచుకున్న విషయం తెలిసిందే. లియాన్క బిగ్‌బాష్ లీగ్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ 38 మ్యాచ్‌లు ఆడిన అతను 7.8 ఎకానమీతో 44 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి
Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌లోకి ప్రణయ్, ప్రియాన్షు
Andy Flower: ఆర్సీబీ కొత్త కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

