Kohli – Rohit : ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ కోల్పోయిన భాధలో ఉన్న భారత అభిమానులకు స్టార్ ఆటగాళ్లు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. వరుసగా రెండు మ్యాచుల్లో సున్నాకే ఔటైనా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) అర్ధశతకంతో చెలరేగిపోగా, రెండో మ్యాచ్‌లో ఫిఫ్టీకే పరిమితమైన రోహిత్ శర్మ (Rohit Sharma) శతకంతో కదం తొక్కాడు. హేజిల్‌వుడ్ ఓవర్లో సింగిల్ తీసి ఖాతా తెరిచిన అతడు కోహ్లీ.. ఓపెనర్ రోహిత్‌తో కలిసి అజేయంగా జట్టును గెలిపించాడు. ఫామ్ అందుకున్న రన్ మెషీన్ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. వన్డేల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.
నామమాత్రమైన సిడ్నీ మైదానంలో అనుకున్నట్టే భారత సీనియర్ క్రికెటర్లు బ్యాట్ ఝులిపించారు. ఆసీస్ బౌలర్లను ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నింపాదిగా ఆడుతూ అజేయంగా టీమిండియాను గెలిపించారు. ఒకప్పటి రోజులను గుర్తుచేస్తూ స్కోర్‌బోర్డును ఉరికించిన ఈ ద్వయం.. తమ ఆటకు తిరుగులేదని చాటారు. ఈ క్రమంలోనే పలు రికార్డులను బద్ధలు కొట్టారిద్దరూ. కూపర్ క్రాన్లీ ఓవర్లో సింగిల్ తీసిన కోహ్లీ వన్డేల్లో 75వ అర్ధ శతకం సాధించాడు.
Kohli surpasses Sangakkara to become the second-highest run-scorer in ODI history ⬆️🇮🇳
Only Sachin Tendulkar sits above him now 👑 pic.twitter.com/W4rpghFWTW
— Sky Sports Cricket (@SkyCricket) October 25, 2025
అనంతరం.. కుమార సంగక్కర పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్ధలు కొట్టాడీ స్టార్ క్రికెటర్. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 14,235 రన్స్ ఉండగా.. టాప్ స్కోరర్‌గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన మాస్టర్ బ్లాస్టర్ 18,426 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే.. వన్డేలు, టీ20లు కలిపితే.. సచిన్ కంటే కోహ్లీ(18,437)నే ఒక పరుగు ముందున్నాడు. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 13,704 పరుగులతో మూడో నాలుగో స్థానంలో నిలిచాడు.
Rohit Sharma brings up a fine century on the SCG! What a moment for him. #AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/p01PjA35dp
— cricket.com.au (@cricketcomau) October 25, 2025
ఇదే మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో.. రోహిత్, విరాట్ కోహ్లీ రికార్డులు బద్ధలు కొట్టారు. కంగారూ బౌలర్లను ఉతికేస్తూ శతకంతో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్ ఆసీస్‌పై 2,500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా వెటరన్ సచిన్ టెండూల్కర్ అనంతరం.. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన ఇద్దరూ.. అత్యధిక శతక భాగస్వామ్యాలతో రికార్డు నెలకొల్పారు. విరాట్ 82 పర్యాయాలు, రోహిత్ 68 సార్లు వన్డేల్లో సెంచరీ పార్ట్నర్షిప్లో భాగమయ్యారు. ఈ జాబితాలో సచిన్ (99 సార్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Rohit Sharma achieves another feat! ✅
He becomes the 2nd #TeamIndia batter after Sachin Tendulkar to complete 2500 ODI runs against Australia 👌
Updates ▶️ https://t.co/omEdJjRmqN#AUSvIND | @ImRo45 pic.twitter.com/qi7GMS7HlP
— BCCI (@BCCI) October 25, 2025
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక శతకాలతో మరో మైలురాయి సాధించాడు రోహిత్. సిడ్నీలో చెలరేగిన హిట్‌మ్యాన్ ఆసీస్‌పై సెంచరీ కొట్టడం ఇది తొమ్మిదోసారి. అతడు సచిన్‌తో సంయుక్తంగా నిలిచాడు. కంగారూ గడ్డపై వన్డేల్లో రోహిత్‌కు ఇది ఆరో శతకం. అత్యధిక సెంచరీలు బాదిన పర్యాటక ఆటగాడిగా అతడు అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ (5) రెండో స్థానంలో ఉన్నాడు.
Most 100s vs AUS in ODI
9 – 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 (49 Inngs)*
9 – Sachin Tendulkar (70 Inngs)
8 – Virat Kohli (51 Inngs)
6 – Desmond Haynes (64 Inngs) pic.twitter.com/NrH5ByNNI9— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 25, 2025
మొత్తంగా చూస్తే.. అంతర్జాతీయంగా (టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో 5 శతకాలు) 50వ సెంచరీ నమోదు చేశాడు మాజీ సారథి రోహిత్. ఇక ఒకే జట్టుపై రికార్డు సెంచరీల జాబితాలో మాత్రం కోహ్లీ ముందున్నాడు. వెస్టిండీస్ఫై 10 సార్లు, శ్రీలంకపై 9సార్లు విరాట్ మూడంకెల స్కోర్ అందుకున్నాడు.