Kohli – Rohit : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli-) లు మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. టీమిండియా జెర్సీతో మరసారి తమ తడాఖా చూపించనున్నారు రోకో. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం అక్టోబర్ 4 శనివారం నాడు స్క్వాడ్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఫిట్నెస్ టెస్టులోనూ పాసైన ఈ ఇద్దరు స్క్వాడ్‌లో ఉండడం ఖాయమని తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం వైట్ బాల్ సిరీస్ కోసం భారత జట్టు అక్టోబర్‌లోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. సిరీస్‌కు సమయం దగ్గరపడడంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు వన్డే, టీ20 స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్, హిట్మ్యాన్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేయడంపై ఎలాంటి సందేహాలు లేవు. అయితే.. రోహిత్‌కే పగ్గాలు అప్పగిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Finally Rohit Sharma and Virat Kohli will be back in ODIs against Australia. It’s been a long time since we have seen them play.
RoKo on fire 🔥 #INDvsWI #INDvWI #ViratKohli #RohitSharma pic.twitter.com/lJ1vDKcVat
— 𝙊𝙋 𝙑𝙄𝙉 🆇 (@vinsaa96) October 3, 2025
భారత్, ఆసీస్ మధ్య అక్టోబర్ 19న పెర్త్‌లో తొలి వన్డే జరుగనుంది. అనంతంర అడిలైడ్‌లో అక్టోబర్ 23న రెండో వన్డే.. ఆపై అక్టోబర్ 25న సిడ్నీలో మూడో మ్యాచ్ ఉంటాయి. వన్డే సిరీస్ ముగియగానే సూర్యకుమార్ సారథ్యంలోని బృందం 5 మ్యాచ్‌ల పొట్టి సిరీస్ కోసం కంగారూ దేశంలో వాలిపోయనుంది. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగనుంది. నిరుడు టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన తర్వాత పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్, రోహిత్.. ఇంగ్లండ్ పర్యటనకు ముందే టెస్టులకూ అల్విదా చెప్పేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.