Virat Kohli : ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో చెలరేగి ఆడుతున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) అప్పుడప్పుడు తన కెరియర్ గురించిన పలు విషయాల్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఆర్సీబీ ‘బోల్డ్ డైరీస్’లో మాట్లాడుతూ విరాట్ ఆసక్తికర సంగతులు చెప్పాడు. తాను టీమిండియా కెప్టెన్సీతో పాటు బెంగళూరు సారథిగా వైదొలగడానికి కారణాలను వెల్లడించాడు.
‘భారత జట్టుకు కెప్టెన్‌గా నాపై ఒత్తిడి ఉండేది. జట్టు ప్రదర్శనకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అయినా సరే కొన్నిసార్లు విమర్శలు తప్పేవి కావు. దాంతో, ఇక నావల్ల కాదనిపించింది. 2016 -19 మధ్య నా కెరియర్ ఉన్నతంగా సాగింది. అయితే.. ఆ తర్వాత ఫామ్ లేమితో పాటు జట్టు నిరాశజనక ప్రదర్శన కూడా నేను ఒక నిర్ణయానికి వచ్చేలా చేశాయి.
“𝘞𝘩𝘢𝘵’𝘴 𝘮𝘰𝘳𝘦 𝘪𝘮𝘱𝘰𝘳𝘵𝘢𝘯𝘵 𝘪𝘴 𝘵𝘩𝘦 𝘳𝘦𝘭𝘢𝘵𝘪𝘰𝘯𝘴𝘩𝘪𝘱 𝘢𝘯𝘥 𝘵𝘩𝘦 𝘮𝘶𝘵𝘶𝘢𝘭 𝘳𝘦𝘴𝘱𝘦𝘤𝘵 𝘰𝘷𝘦𝘳 𝘴𝘰 𝘮𝘢𝘯𝘺 𝘺𝘦𝘢𝘳𝘴, 𝘢𝘯𝘥 𝘐’𝘮 𝘨𝘰𝘪𝘯𝘨 𝘵𝘰 𝘴𝘦𝘦 𝘪𝘵 𝘵𝘩𝘳𝘰𝘶𝘨𝘩 𝘯𝘰𝘸! 𝘛𝘩𝘪𝘴 𝘪𝘴 𝘮𝘺 𝘏𝘖𝘔𝘌. 𝘛𝘩𝘦 𝘭𝘰𝘷𝘦 𝘐 𝘩𝘢𝘷𝘦… pic.twitter.com/n0DErxgonp
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 6, 2025
పైగా నేను సంతోషంగా ఉంటూ ఆటను ఆస్వాదించాలనుకున్నా. ప్రశాంతంగా ఉంటూ జట్టులో సభ్యుడిగా కొనసాగాలి అనుకున్నా. అందుకే సారథిగా తప్పుకున్నాను. ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్‌గానూ వైదొలిగా’ అని కోహ్లీ వెల్లడించాడు.
అండర్ -19 వరల్డ్ కప్ హీరోగా టీమిండియాకు ఎంపికైన విరాట్.. అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న ఈ రన్‌మెషీన్.. సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) తరహాలోనే టీమిండియాకు దూకుడు నేర్పాడు. విరాట్ కెప్టెన్సీలోనే భారత్ టెస్టుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అంతేకాదు ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్లో ఆడింది. 2013 నుంచి 2022 వరకూ 213 మ్యాచుల్లో కోహ్లీ టీమిండియాకు నాయకత్వం వహించాడు. 2011 నుంచి 2023 వరకూ..143 మ్యాచుల్లో ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్నాడు.
విరాట్ నేతృత్వంలో బెంగళూరు 2014, 2016లో ఫైనల్‌కు చేరింది. కానీ, ఆఖరి మెట్టుపై తడబడి కప్పు చేజార్చుకుంది. అయితే.. ఆరంభ సీజన్ నుంచి ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు ఆర్సీబీ ఈసారి సర్వశక్తులు ఒడ్డుతోంది.
టాపార్డర్‌లో విరాట్, పడిక్కల్, కెప్టెన్ పటిదార్లు దంచేస్తుంటే.. బౌలింగ్‌లో హేజిల్‌వుడ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యాలు ప్రత్యర్థిని వణికిస్తున్నారు. దాంతో, 11 మ్యాచుల్లో 8 విజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందున్న బెంగళూరు ఈసారి ట్రోఫీతో మురిసిపోవాలని అనుకుంటోంది. అదే జరిగితే.. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్టే.
When the King owns the crease, we conquer the field! 👑💪#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/ZNafKMwtyI
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 5, 2025