Guvvala Balaraju | అచ్చంపేట టౌన్ : అచ్చంపేట పట్టణంలో నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయి నాభిశీలకి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అమల దంపతులు మంగళవారం అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పట్టణంలో పోచమ్మ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేపట్టి పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన తరుణంలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అమీనుద్దీన్, మాజీ జెడ్పిటిసి రాంబాబు, శంకర్ మాదిగ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.