నాగ్‌పూర్ : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియాకు ఆందోళన కల్గించే వార్త. మోకాలి నొప్పితో ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మ్యాచ్ ముందు రోజు సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసిన కోహ్లీ గాయం బారిన పడ్డాడు. దీంతో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మోకాలుకు పట్టితో కనిపించిన కోహ్లీ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈనెల 9న కటక్‌లో జరిగే రెండో వన్డేలో ఆడుతాడా లేక..చికిత్స కోసం ఎన్సీఏ(బెంగళూరు)కు వెళ్తాడా అన్నది తేలాల్సి ఉంది.