దుబాయ్ : వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ తన ర్యాంక్‌ను మెరుగుపరచుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేసి రెండు ర్యాంకులు మెరుగై ఆరో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ సిరాజ్ ర్యాంక్‌లు కూడా మెరుగయ్యాయి.
రెండో వన్డేలో 83 పరుగులు చేసిన రోహిత్ ఒక స్థానం మెరుగై 8వ ర్యాంక్‌కు చేరుకోగా, బౌలర్లలో సిరాజ్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని 18వ స్థానానికి చేరుకున్నాడు. టి20లలో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.