Dean Elgar | కెరీర్లో చివరి ఇన్నింగ్స్.. సఫారీ సారథిని హత్తుకున్న కోహ్లీ
Dean Elgar : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్(Dean Elgar) కెరీర్లో చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. కేప్‌టౌన్ (Kape Town)లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతడు ఆఖరిసారి క్రీజులో అడుగుపెట్టాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఎల్లర్...
Dean Elgar : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్(Dean Elgar) కెరీర్లో చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. కేప్‌టౌన్ (Kape Town)లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతడు ఆఖరిసారి క్రీజులో అడుగుపెట్టాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో ఎల్లర్ 12 పరుగులకే ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ ఓవర్లో విరాట్ కోహ్లీ(Virat Kohli)కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ పట్టిన అనంతరం విరాట్.. ఎల్గర్‌ను ‘టేక్ ఏ బో’ గెశ్చర్‌తో అభినందించాడు.
అంతేకాదు అతడి దగ్గరకు వెళ్లి హత్తుకున్నాడు. భారత్ జట్టు సభ్యులంతా సఫారీ సారథిని అభినందించారు. అనంతరం ఎల్గర్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేశాడు. ఫ్యాన్స్ అందరూ లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ అతడికి వీడ్కోలు పలికారు.
#MukeshKumar‘s nibbler gets #DeanElgar on his final test!
Will #TeamIndia keep racking up wickets before the day’s play?
Tune in to #SAvIND 2nd Test
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/qftk1SpI8D— Star Sports (@StarSportsIndia) January 3, 2024
సిరీస్ డిసైడర్ అయిన కేప్‌టౌన్ టెస్టులో ఇరుజట్ల బౌలర్లు నిప్పులు చెరిగారు. మొదట సిరాజ్.. ఆతర్వాత రబడ, ఎంగిడి విజృంభణతో ఒక్క రోజే 23 వికెట్లు పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో 55 రన్స్‌కే పరిమితమైన ప్రొటిస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాల్లో పడింది.

భారత బౌలర్లు జోరుకు తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. భారత్ కంటే దక్షిణాఫ్రికా ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ముకేశ్ తొలుత డీన్ ఎల్గర్(12)ను, అనంతరం టోని డి జొర్జి(1) పెవిలియన్ పంపాడు. కాసేపటికే బుమ్రా బౌన్సర్‌తో స్టబ్స్(0)ను వెనక్కి పంపడంతో ఎల్గర్ సేన 45 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ మర్క్రమ్(36 నాటౌట్), బెడింగ్హమ్(7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
ఇవి కూడా చదవండి
- Novak Djokovic | జకోవిచ్ జైత్రయాత్రకు బ్రేక్.. టాప్ సీడ్‌ను మట్టికరిపించిన 12వ ర్యాంకర్
- Sankranthi Movies | సలార్, డంకీని చూసిన తర్వాత కూడా మార్పు రావట్లేదేంటి..?
- Guntur Kaaram | మహేశ్‌బాబు ఫ్యాన్స్ గెట్ రెడీ.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Dean Elgar
- kape town
- Ngidi
- Rabada
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

