Novak Djokovic | జకోవిచ్ జైత్రయాత్రకు బ్రేక్.. టాప్ సీడ్‌ను మట్టికరిపించిన 12వ ర్యాంకర్
Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 43 మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న జకోకు 12వ ర్యాంకర్ అలెక్స్ డి మినౌర్(Alex De Minaur) చెక్ పెట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన మినౌర్ బుధవారం యునైటెడ్ కప్(United Cup)...
Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 43 మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న జకోకు 12వ ర్యాంకర్ అలెక్స్ డి మినౌర్(Alex De Minaur) చెక్ పెట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన మినౌర్ బుధవారం యునైటెడ్ కప్(United Cup) క్వార్టర్ ఫైనల్లో సెర్బియా స్టార్‌ను ఓడించాడు. 94 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో రెండు సెట్లలో జోరు చూపిస్తూ 6-4, 6-4తో టాప్ సీడ్ జకోను మట్టికరిపించాడు.
2018 ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి తర్వాత.. కంగారూల గడ్డపై మళ్లీ జకోవిచ్ పరాజయం పాలవ్వడం ఇదే మొదటిసారి. మరో మ్యాచ్‌లో అజ్లా తొమ్ల్జనోవిక్(Ajla Tomljanovic) సెర్బియాకే చెందిన నటలిజా స్టెవానోవిక్పై 6-1, 6-1తో గెలుపొందింది. దాంతో, 2-0 ఆధిక్యంతో ఆస్ట్రేలియా దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లింది.
Ohhhhhhh…
STOP THAT, @alexdeminaur!!! 💫#UnitedCup pic.twitter.com/pPGbax31vB
— United Cup (@UnitedCupTennis) January 3, 2024
‘ఈ రోజు నిజంగా చాలా స్పెషల్. నొవాక్ అద్భుతమైన ప్రత్యర్థి. ఆస్ట్రేలియా గడ్డపై తిరుగులేని అతడిని ఓడించినందుకు చాలా సంతోషంగా ఉంది. జకోవిచ్‌తో తలపడేటప్పుడు మ్యాచ్‌ను ఎంజాయ చేయాలి. అదేసమయంలో చివరిదాకా పోరాడాలి’ అని మినౌర్ మ్యాచ్ అనంతరం అన్నాడు. నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా జకోవిచ్‌పై మినౌర్ పైచేయి సాధించాడు. కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో రికార్డు సృష్టించిన జకో.. త్వరలో జరుగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈసారి అతడికి చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్ ఎదురుపడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
- IND vs RSA | రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్ల జోరు.. పోరాడుతున్న సఫారీలు
- TPCC | తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలి.. తీర్మానం ప్రతిపాదించిన రేవంత్ రెడ్డి
- CS Shanti Kumar | అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ 17లోగా పూర్తి చేయాలి : సీఎస్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

