CS Shanti Kumar | అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ 17లోగా పూర్తి చేయాలి : సీఎస్
CS Shanti Kumar | ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీలను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దారకాస్తుల డాటా ఎంట్రీలపై కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
CS Shanti Kumar | ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీలను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దరఖాస్తుల డాటా ఎంట్రీలపై కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామసభలను ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడంపై కలెక్టర్లను సీఎస్ అభినందించారు. 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు.
మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షించాలని తెలిపారు. ఈ డాటా ఎంట్రీ చేపట్టేందుకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రస్థాయిలో ట్రెయినీ ఆఫ్ ట్రైనర్ (TOT )లకు 4న శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ టీఓటీలకు జిల్లా స్థాయిలో డాటా ఎంట్రీ ఏవిధంగా చేయాలన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. 5 నుంచి 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, ఈ డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమించుకోవాలని ఆదేశించారు. నిన్నటి వరకు దాదాపు 57లక్షల దరఖాస్తులు అందాయని, ప్రతీ నాలుగునెలలకోసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దరఖాస్తులు ఇవ్వని వారు తిరిగి దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయితీ రాజ్ కమిషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

