Sankranthi Movies | ఇండస్ట్రీలో పోటీ మంచిదే.. ఒకేసారి రెండు మూడు సినిమాలు రావడం కూడా పెద్దగా ఇబ్బందికరంగా ఉండదు. కాకపోతే ఒక్కోసారి తగ్గడంలో కూడా గెలుపు ఉంటుంది. మొండితనానికి వెళ్లి ఒకేసారి మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తే అన్నీ నష్టపోయిన సందర్భంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతికి ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే..! ఒకేసారి రిలీజై నష్టపోయిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సలార్, డంకీ సినిమాలే. డిసెంబర్ 21, 22వ తేదీల్లో ఈ రెండు సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలకు 1000 కోట్ల స్టామినా ఉంది. కానీ తగ్గేదే లే అంటూ వరుస రోజుల్లో ఈ సినిమాలు విడుదల చేశారు. దాంతో రెండు సినిమాలకు సరైన కలెక్షన్స్ రాలేదు.
సౌత్ మొత్తం సలార్ హవా కనిపిస్తే.. నార్త్‌లో చాలా చోట్ల డంకీ థియేటర్స్ తీసుకున్నాడు. దాంతో రెండు సినిమాలకు దాదాపు 300 నుంచి 400 కోట్ల వరకు నష్టాలు తప్పలేదు. ఇంత పోటీలో కూడా సలార్ 650 కోట్లు వసూలు చేస్తే.. డంకీ సినిమా 350 కోట్లు తీసుకొచ్చింది. ఒకవేళ ఈ రెండు కాస్త గ్యాప్ తీసుకొని వచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక సినిమా అయినా 1000 కోట్లు దాటి ఉండేది అనేది ట్రేడ్ విశ్లేషకుల వాదన. సలార్ సినిమా అయితే ఈజీగా 1000 కోట్లు క్రాస్ చేసేది అంటున్నారు. ఎందుకంటే నార్త్‌లో షారుక్ సినిమా ఉండడంతో చాలా వరకు సలార్ సినిమాకు అనుకున్న థియేటర్స్ రాలేదు.
ఇప్పుడు సేమ్ సిచువేషన్ సంక్రాంతి సినిమాలకు కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకేసారి 5 సినిమాలు రావడం అనేది ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది ట్రేడ్ పండితుల వాదన. డిస్ట్రిబ్యూటర్లు కూడా లోలోపల భయంగానే ఉన్నా బయటికి మాత్రం ఏం మాట్లాడలేకపోతున్నారంతే. ఎందుకంటే అక్కడ ఉన్నది స్టార్ హీరోలు కాబట్టి.. ఎవరు వెనక్కి దగ్గరనే క్లారిటీ వాళ్లకు కూడా ఉంది కాబట్టి..! అన్నిటికంటే ముందు సురేశ్ బాబు, దిల్ రాజు దగ్గర కావాల్సినన్ని థియేటర్స్ ఉన్నాయి. వాళ్ల వాళ్ల సినిమాలకు అవి అడ్జస్ట్ చేస్తారు. కానీ మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈగల్ సినిమా వస్తుంది. అందులో రవితేజ లాంటి స్టార్ హీరో ఉన్నా వాళ్లకు థియేటర్స్ వస్తాయని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. వీళ్లు ఎంతవరకు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎలాంటి సపోర్ట్ లేకుండా వస్తున్న హనుమాన్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వీటన్నింటికి తోడు నాగార్జున నా సామిరంగా కూడా జనవరి 14న వస్తుంది. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా గుంటూరు కారంకు కనీసం 60 శాతం థియేటర్లు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు.. దానికి టాక్ కానీ పాజిటివ్‌గా వస్తే కచ్చితంగా థియేటర్లు పెంచుకుంటూ వెళ్తారు తప్ప తగ్గించే ఆస్కారమే ఉండదు. మరి ఇంత పోటీలో ఎవరి కలెక్షన్స్ ఎవరు దోచుకెళ్లిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది.