Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మైదానంలో సిరియస్‌నెస్ కొనసాగిస్తూనే చిలిపి చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాడు. మ్యాచ్ స్తబ్దుగా సాగుతున్న సమయంలో డ్యాన్స్ చేసి, విచిత్ర హావభావాలను ప్రదర్శించి ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంటాడు. ఈ రికార్డుల రారాజు తాజాగా ఇలాంటి పనే చేశాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు నెట్స్‌లో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) బౌలింగ్‌లో సాధన చేస్తున్న కోహ్లీ.. ఓ బంతికి చక్కటి షాట్ కొట్టి తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు.
‘మంచి బంతి వేస్తే ఇలా కొట్టాడేంటి..?’ అన్నట్లు పాండ్యా చూస్తూంటే.. కోహ్లీ మాత్రం ఈ బంతి బౌండ్రీ దాటడం పక్కా అన్నట్లు డ్యాన్స్ చేశాడు. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు ఫోర్ సిగ్నల్ ఇస్తున్నట్లు.. తనదైన డ్యాన్సింగ్ స్టెల్లో చేతులు ఊపుతూ విచిత్ర హావభావాలు పలికించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారగా.. అభిమానులు చిలిపి కామెంట్స్ చేస్తున్నారు.
Virat Kohli’s funny gesture towards Hardik Pandya 🤣🤣#viratkohli pic.twitter.com/QE40Y3VXQt
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@Imlakshay_18) July 27, 2023
విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ(121) అద్భుత సెంచరీతో రికార్డులు సృష్టించాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్‌లో వంద కొట్టిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 76వ శతకం సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. దాంతో, టీమిండియా టెస్టు సిరీస్‌ను 1-0తో చేజక్కించుకుంది.
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు భారత్, విండీస్ మధ్య బార్బడాస్లోని కెన్షింగ్టన్ ఓవల్ (Kensington Oval)లో తొలి వన్డే జరుగనుంది. ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత జట్టు ఈ సిరీస్‌ను మెగాటోర్నీకి సన్నాహకంగా భావిస్తోంది.