SL vs PAK | రెండో టెస్టులో ఇన్నింగ్స్ విజయం.. శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్
SL vs PAK : టెస్టు ర్యాకింగ్స్(Test Rankings)లో టాప్‌లో ఉన్నపాకిస్థాన్(Pakistan) జట్టు రెండో టెస్టులోనూ ఇరగదీసింది. ఏకపక్ష పోరులో ఆతిథ్య శ్రీలంక(Srilanka)పై ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలిచి 2-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. నొమన్ అలీ(Noman Ali) 7 వికెట్లతో చెలరేగడంతో భారీ విజయం....
SL vs PAK : టెస్టు ర్యాకింగ్స్(Test Rankings)లో టాప్‌లో ఉన్నపాకిస్థాన్(Pakistan) జట్టు రెండో టెస్టులోనూ ఇరగదీసింది. ఏకపక్ష పోరులో ఆతిథ్య శ్రీలంక(Srilanka)పై ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలిచి 2-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. నొమన్ అలీ(Noman Ali) 7 వికెట్లతో చెలరేగడంతో భారీ విజయం సాధించింది. నొమాన్, నసీం షా(3 వికెట్లు) దెబ్బకు లంక ఏదశలోనూ కోలుకోలేకపోయింది.
కనీస పోరాటం చేయకుండానే రెండో ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు కుప్పకూలింది. దాంతో, సొంత గడ్డపై అత్యంత భారీ ఓటమిని మూటగట్టుకుంది. డబుల్ సెంచరీ బాదిన అబ్దుల్లా షఫిక్(201)కు,’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, అఘా సల్మాన్(Agha Salman)కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
ఏడు వికెట్లు తీసిన నొమన్ అలీకి సహచరుల అభినందన

కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన టెస్టులో పాక్ జట్టు అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన లంకను 166 పరుగులకే కట్టడి చేసింది. నసీం షా 3 వికెట్లు, అబ్రార్ అహ్మద్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టును హడలెత్తించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫిక్(201) డబుల్ సెంచరీ, అఘా సల్మాన్ (132) సెంచరీ కొట్టడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. 410 ఆధిక్యం రాగానే 576 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అబ్దుల్లా షఫిక్(201)

దాంతో, సిరీస్‌లో నిలవాలంటే లంక బ్యాటర్లు పోరాడాల్సిన పరిస్థితి. కానీ, నొమన్ అలీ ధాటికి రెండో ఇన్నింగ్స్‌లోనూ అంతా చేతులెత్తేశారు. మాజీ కెప్టెన్ ఎంజెలో మ్యాథ్యూస్(63 నాటౌట్), కెప్టెన్ దిముత్ కరుణరత్నే(41) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. మిగతావాళ్ల నుంచి సహకారం అందకపోవడంతో లంక 188 పరుగుల వద్ద ఆలౌటయ్యింది.
ఇంకా అగ్రస్థానంలోనే..
తొలి టెస్టులో లంకను చిత్తు చేసిన పాక్ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలోకి దూసుకొచ్చింది. భారత్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియా వెనకబడింది. దాంతో, పాకిస్థాన్ 100 శాతం విజయాలతో టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. భారత్(66.67 శాతం విజయాలు) రెండో స్థానంలో, ఆస్ట్రేలియా(54.17 శాతం విజయాలు) మూడో స్థానంలో ఉన్నాయి. యాషెస్ ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే.. టెస్టు ర్యాకింగ్స్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Japan Open | శ్రీకాంత్‌ను చిత్తు చేసిన ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడీ
Djokovic’s father | వచ్చే ఏడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతాడేమో.. జకోవిచ్ తండ్రి షాకింగ్ కామెంట్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

