Djokovic’s father | వచ్చే ఏడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతాడేమో.. జకోవిచ్ తండ్రి షాకింగ్ కామెంట్స్
Djokovic's father : సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ రికార్డులతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరో గ్రాండ్ స్లామ్ వేటలో ఉన్న జకోవిచ్‌పై తండ్రి స్ర్ద్జన్ జకోవిచ్(Srdjan Djokovic) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జకోవిచ్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పుతాడేమో అని అతను...
Djokovic’s father : సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ రికార్డులతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే ఊపులో విబుల్డన్ టైటిల్(wimbledon 2023) గెలవాలని అనుకున్నాడు. కానీ, ఫైనల్లో అనూహ్యంగా నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ (carlos alcaraz,) చేతిలో ఓటమిపాలయ్యాడు. మరో గ్రాండ్ స్లామ్ వేటలో ఉన్న జకోవిచ్‌పై తండ్రి స్ర్ద్జన్ జకోవిచ్(Srdjan Djokovic) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జకోవిచ్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పుతాడేమో అని అతను అన్నాడు.
‘టెన్నిస్ ఆట అనేది శారీరకంగా, మానసికంగా ఎంతో సవాల్‌తో కూడినది. అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాంతో, జీవితంలో ఇతర పనులు చేసేందుకు అతడికి సమయం ఉండడం లేదు. టెన్నిస్ అనేది జకోవిచ్ జీవితంలో ఓ భాగం. అంతేకానీ, అదే జీవితం కాద’ని అతను చెప్పాడు. జకోవిచ్ ఆటకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తతో అతడి అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. కోవిచ్ రిటైర్మెంట్ వార్తతో అతడి అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది.
నాదల్ రికార్డు బద్ధలు
ఈ ఏడాది జకోవిచ్ జోరు కొనసాగిస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న అతను పురుషుల సింగిల్స్‌లో రికార్డు టైటిళ్లు సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్(french open 2023) ఫైనల్లో అల్కరాజ్ను ఓడించి 23వ గ్రాండ్ స్లామ్ ఖాతాలో వేసుకున్నాడు.
వింబుల్డన్ ట్రోఫీతో కార్లోస్ అల్కరాజ్, నొవాక్ జకోవిచ్

దాంతో, అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ వీరుడిగా రఫెల్ నాదల్ (22గ్రాండ్‌స్లామ్స్) నెలకొల్పిన రికార్డు బద్ధలు కొట్టాడు. వింబుల్డన్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అతను ఫైనల్లో కంగుతిన్నాడు. స్పెయిన్ యవ సంచలనం అల్కరాజ్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. దాంతో, ఎనిమిదోసారి వింబుల్డన్ ట్రోఫీ గెలవాలనుకున్న అతడి కల నెరవేరలేదు.
ఇవి కూడా చదవండి
Asian Games 2023 | ఆసియా గేమ్స్ డ్రా.. భారత జట్టు ఏ గ్రూప్‌లో ఉందంటే..?
Steve Smith | టెస్టుల్లో తొలి సెంచరీ ఎంతో స్పెషల్ .. సిక్స్ కొట్టమని చెప్పింది అతనే : స్మిత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

