Steve Smith : యాషెస్ సిరీస్(Ashes Series)లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith) దుమ్మురేపుతున్నాడు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టును ఆదుకుంటున్న అతడి ఖాతాలో 32 సెంచరీలు ఉన్నాయి. ఐదో టెస్టుకు ముందు అతను టెస్టుల్లో తొలి సెంచరీని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు సిక్స్ కొట్టి వందకు చేరువకావడం చాలా ప్రత్యేకంగా అనిపించిందని స్మిత్ అన్నాడు. అయితే.. ఆరోజు తనకు సిక్స్ కొట్టమని బ్రాడ్ హడిన్(Brad Haddin) చెప్పాడని అతను వెల్లడించాడు.
‘నేను 94 వద్ద ఉన్నప్పుడు నాన్ స్ట్రయికర్‌గా ఉన్న హడిన్ నా వద్దకు వచ్చాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయి అన్నాడు. అతను చెప్పినట్టే జొనాథన్ ట్రాట్(Jonathan Trott) బౌలింగ్‌లో బంతిని స్టాండ్స్‌లోకి పంపాను. టెస్టుల్లో మొదటి శతకం సాధించడం చాలా స్పెషల్ ఫీలింగ్’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఈ వరల్డ్ నంబర్ 2 బ్యాటర్ 2013లో ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సెంచరీ కొట్టాడు.
ఫాబ్ -4లో ఒకడైన స్మిత్‌కు టెస్టు క్రికెట్లో అద్భుత రికార్డు ఉంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో స్మిత్ వరుసగా 2015, 16, 17లో నంబర్ 1 ఆటగాడిగా నిలిచాడు. 2010లో ఆరంగేట్రం చేసిన అతను అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్
ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో వందకు చేరువై 32వ శతకం ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, అస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు కొట్టిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. రికీ పాంటింగ్(Rickey Ponting) 41 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
యాషెస్ సిరీస్‌లో కీలకమైన ఆఖరి టెస్టులో ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ నెగ్గిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దాంతో, కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఈ టెస్టులో ఆసీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కామెరూన్ గ్రీన్ స్థానంల్ టాడ్ మర్ఫీ జట్టులోకి వచ్చాడు. యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దాంతో, గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ డ్రాతో సరిపెట్టుకుంది. కాబట్టి విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.