ముంబై: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) కొత్త లుక్ ఇంటర్నెట్లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. అర్జున్ తన సిక్స్ ప్యాక్ బాడీతో కేక పుట్టిస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఐపీఎల్ ఆడిన ఆ ప్లేయర్.. తాజాగా తన ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్లో నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు తీసుకున్న అతను.. ఈ సీజన్లో సౌత్ జోన్ తరపున దేవదర్ ట్రోఫీ ఆడుతున్నాడు.
అర్జున్ టెండూల్కర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొత్త ఫోటోలను పోస్టు చేశాడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిక్స్ ప్యాక్ ఆబ్స్తో అర్జున్ అట్రాక్ట్ చేస్తున్నాడు. షర్ట్ లేకుండా అద్దంలో సెల్ఫీ దిగిన ఫోటోను అర్జున్ తన ఇన్స్టాలో పోస్టు చేశాడు.
జూన్లో అర్జున్ .. బెంగుళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో 20 రోజుల క్యాంపులో పాల్గొన్నాడు. గోవా తరపున అర్జున్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.