Ashes Series : యాషెస్ సిరీస్‌లో కీలకమైన ఆఖరి టెస్టు కెన్నింగ్టన్ ఓవల్(Kennington Oval)లో జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) స్థానంలో టాడ్ మర్పీ(Todd Murphy) ఆడుతున్నాడు. ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఆసీస్ మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇరు జట్లులో11 మంది ఆటగాళ్లు ఎవరంటే..?
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, టాడ్ మర్ఫీ.
ఇంగ్లండ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, మోయిన్ అలీ, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.
యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దాంతో, గెలిచి తీరాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ డ్రాతో సరిపెట్టుకుంది. దాంతో, ఈ టెస్టు ఆతిథ్య జట్టుకు చావోరేవో కానుంది.
మార్నస్ లబూషేన్
అయితే.. ఆసీస్ మాత్రం పట్టు విడిచేలా కనిపించడం లేదు. ఆ జట్టు స్టార్ ఆటగాడు లబూషేన్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాదు హెడ్, ఖవాజా, స్మిత్ జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇంగ్లండ్ జట్టు కూడా బౌలింగ, బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తోంది. దాంతో, ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.