Asian Games 2023 : ఆసియా గేమ్స్ ఫుట్‌బాల్ డ్రా(Foot Ball Draw) ఈరోజు తీశారు. భారత పురుషుల జట్టు(Indian Mens Team) గ్రూప్ ‘ఏ’ లో చోటు దక్కించుకుంది. అదే గ్రూప్‌లో చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ జట్లు ఉన్నాయి. మహిళల జట్టు గ్రూప్ ‘బి’లో స్థానం సంపాదించుకుంది. ఇదే గ్రూప్‌లో చైనీస్ తైపీ, థాయ్‌లాండ్ దేశాలు ఉన్నాయి. ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19న మొదలవ్వనుండగా 23వ తేదీ నుంచి ఫుట్‌బాల్ పోటీలు జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 9న నిర్వహించనున్నారు. భారత పురుషుల జట్టు సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.
ఈ ఏడాది ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల జట్టు ఆడడంపై మొదట్లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. భారత క్రీడా మంత్రిత్వ శాఖ(Sports Ministry) కఠినమైన నిబంధన పెట్టడమే అందుకు కారణం. నియమాల ప్రకారం టాప్ -8లో ఉన్న జట్లకే ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది.
ꜰɪꜰᴀ ᴡᴏʀʟᴅ ᴄᴜᴘ 2026 ᴘʀᴇʟɪᴍɪɴᴀʀʏ ᴊᴏɪɴᴛ Qᴜᴀʟɪꜰɪᴄᴀᴛɪᴏɴ ʀᴏᴜɴᴅ 2 🤩👏🏽
ɢʀᴏᴜᴘ ᴀ
🇶🇦
🇮🇳
🇰🇼
🇦🇫 / 🇲🇳#FIFAWorldCup 🏆 #AsianCup2027 🏆 #IndianFootball ⚽️ pic.twitter.com/s2uCuzVI5j— Indian Football Team (@IndianFootball) July 27, 2023
కానీ, భారత జట్టు ఆసియాలో 18వ ర్యాంకు, ప్రపంచవ్యాప్తంగా 99వ ర్యాంక్‌లో నిలిచింది. దాంతో, టోర్నమెంట్‌కు దూరమవుతుందని అంతా అనుకున్నారు. అయితే… క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ర్యాంక్‌ల విషయంలో మినహాయింపునిస్తూ ప్రకటన విడుదల చేశాడు. దాంతో, సునీల్ ఛెత్రీ బృందానికి లైన్ క్లియర్ అయింది.
ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫిడెరేషన్(Asian Football Confederation) ఈరోజు రెండో విడత ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్(FIFA World Cup 2026) డ్రా విడుదల చేసింది. అందులో భారత పురుషుల జట్టు గ్రూప్ ఏ లో నిలిచింది. ఈ గ్రూప్‌లో ఖతార్, కువైట్ జట్లు ఉన్నాయి. వీటితో పాటు మంగోలియా, అఫ్గనిస్థాన్ మ్యాచ్ విజేత చోటు దక్కించుకుంటుంది.
శాఫ్ చాంపియన్‌షిప్ ట్రోఫీతో భారత జట్టు
ఈ ఏడాది ఆరంభం నుంచి టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. స్వదేశంలో జరిగిన ఇంటర్కాంటినెంటల్ కప్, శాఫ్ చాంపియన్‌షిప్( SAFF Championship 2023)లో టైటిల్ విజేతగా నిలిచింది. దాంతో, వరల్డ్ కప్ అర్హత పోటీలకు ఎంపికైంది.