Japan Open | శ్రీకాంత్‌ను చిత్తు చేసిన ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడీ
Japan Open : భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) జపాన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. యొయొగి నేషనల్ జిమ్నాషియం కోర్టు 1లో ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో అతను భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth)పై గెలుపొందాడు. డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్(Satwiksairaj) - చిరాగ్ శెట్టీ(Chirag Shetty) డెన్మార్క్‌కు చెందిన జెప్పె బే, లస్సె మొల్మొడేపై...
Japan Open : భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) జపాన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. యొయొగి నేషనల్ జిమ్నాషియం కోర్టు 1లో ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో అతను భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth)పై గెలుపొందాడు. హోరాహోరీగా జరిగిన పోరులో 19-21, 21-9, 21-9తో అతను శ్రీకాంత్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్ కోల్పోయినప్పటికీ వెనుకడుగు వేయకుండా అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. వరుసగా రెండు సెట్లు సొంతం చేసుకొని క్వార్టర్స్‌లో కాలు మోపాడు.
శ్రీకాంత్‌పై ప్రణయ్‌కు నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అవును.. 2019లో చివరిసారగా ప్రణయ్, శ్రీకాంత్‌ను ఓడించాడు. ఇప్పటివరకూ వీళ్లు తొమ్మిదిసార్లు తలపడ్డారు. అయితే.. మూడు సార్లు మాత్రమే ప్రణయ్ అతడిపై విజయం సాధించాడు. అంతేకాదు శ్రీకాంత్‌ను మూడు సార్లు ఓడించిన రెండో భారత షట్లర్‌గా ప్రణయ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు.. లక్ష్యసేన్(Lakshya Sen) కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాడు.
సాత్విక్ – చిరాగ్ ముందంజ
భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్(Satwiksairaj) – చిరాగ్ శెట్టీ(Chirag Shetty) జపాన్ ఓపెన్‌లోనూ సత్తా చాటుతున్నారు. డెన్మార్క్‌కు చెందిన జెప్పె బే, లస్సె మొల్మొడేపై 21-17, 21-11తో గెలుపొందారు. క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ చి లిన్, లీ యాంగ్‌ను వీళ్లు ఢీ కొననున్నారు.
సాత్విక్‌సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ

సాత్విక్ – చిరాగ్ ద్వయం గత వారమే కొరియా ఓపెన్(Korea Open) చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇది వాళ్లకు కెరీర్లో మూడో బీడబ్ల్యూఎఫ్(BWF) టైటిల్. ఈ ఏడాది వీళ్లు ఇండోనేషియా ఓపెన్(Indonasia Open)లో ట్రోఫీ సాధించారు. దాంతో, ఈ ట్రోఫీ నెగ్గిన తొలి భారత డబుల్స్ జోడీగా సాత్విక్ – చిరాగ్ శె రికార్డుల్లోకి ఎక్కారు.
ఇవి కూడా చదవండి
Djokovic’s father | వచ్చే ఏడాది టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతాడేమో.. జకోవిచ్ తండ్రి షాకింగ్ కామెంట్స్
Asian Games 2023 | ఆసియా గేమ్స్ డ్రా.. భారత జట్టు ఏ గ్రూప్‌లో ఉందంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

