IND vs NZ 1st Test : తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన సర్ఫరాజ్ ఖాన్(52), విరాట్ కోహ్లీ(50)లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి.. చెరో యాభై కొట్టేశారు. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీకి ఇది 31వ ఫిఫ్టీ. మెరుపు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించింది. దాంతో, భారత స్కోర్ బోర్డు వేగం అందుకోగా తొలి ఇన్నింగ్స్ లోటును తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 191/2 . ఇంకా రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు వెనకబడి ఉంది.
చిన్నస్వామిలో 46 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ దీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి తేరుకున్న టాపార్డర్ దంచడమే పనిగా పెట్టుకున్నట్టు ఆడింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(35) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. అయితే.. అజాజ్ పటేల్ ఓవర్లో ఫ్రంట్‌ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు.
The Chinnaswamy crowd applauds a Virat Kohli fifty 👏https://t.co/tzXZHnJhUa #INDvNZ pic.twitter.com/ruzjW3rCV1
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024
72 వద్ద తొలి వికెట్ పడినా కెప్టెన్ రోహిత్ శర్మ(52) జోరు తగ్గించలేదు. పెంచాడు. తొలి ఇన్నింగ్స్‌లో హడెలెత్తించిన మ్యాట్ హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదేసి అర్ధ శతకం సాధించాడు. ఆ కాసేపటికే అజాజ్ పటేల్ ఓవర్లో ఊహించని విధంగా అతడు బౌల్డ్ అయ్యాడు.