Chandrababu | తప్పులు చేస్తే వైసీపీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది : చంద్రబాబు
Chandrababu | వైసీపీ(YCP) హయాంలో జరిగిన తప్పులను తెలుగు తమ్ముళ్లు కూడా చేస్తే ఎన్నికల్లో వారికి పట్టిన గతే టీడీపీకి పడుతుందని, జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
అమరావతి : వైసీపీ(YCP) హయాంలో జరిగిన తప్పులను తెలుగు తమ్ముళ్లు కూడా చేస్తే ఎన్నికల్లో వారికి పట్టిన గతే టీడీపీకి పడుతుందని, జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ ముఖ్యమని, ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదని వెల్లడించారు. మనం చేసే మంచి పనులే వచ్చే ఎన్నికలకు ఉపయోగపడుతాయిని పేర్కొన్నారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే వైసీపీ 11 స్థానాలకు పడిపోయిందో గ్రహించాలన్నారు. టీడీపీ కూడా అదే తీరున వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణకాష్టమే అవుతుందని అన్నారు.
కూటమిలో ఎవరూ తప్పుచేసినా ఆ ప్రభావం సీఎంపై ఉంటుందని గుర్తించాలని సూచించారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలి పెట్టబోమని, అలాగని కక్షసాధింపులకు వెళ్లకూడదని సూచించారు. కొత్తగా మద్యం(Liquor) లో వేలు పెడతామంటే కుదరదని అన్నారు. మద్యం, ఇసుక విధానాలపై మళ్లీ విడిగా అందరితో మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పాలసీలు గేమ్ ఛేంజర్ కానున్నాయని అన్నారు. 2029లో మళ్లీ గెలవాలంటే ఎన్డీయేను అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. సంఘటిత శక్తిగా పనిచేస్తేనే ప్రజల అంచనాలను అందుకోగలమని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

