Ravichandran Ashwin : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం గురించిన చర్చలు జోరుగా సాగతున్నాయి. ఈసారి రోహిత్ శర్మ (Rohit Sharma) రూ.50 కోట్లు పలకడం ఖాయమేనా? అని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదిలేయాలి? అనే విషయమై ఫ్రాంచైజీలు భారీ కసరత్తే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ‘ఆల్ టైమ్’ ఐపీఎల్ జట్టును ప్రకటించాడు.
ఐపీఎల్లో చెరగని ముద్ర వేసిన 11 మందితో టీమ్‌ను అశ్విన్ వెల్లడించాడు. అశ్విన్ ఎంపిక చేసిన ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్ ఎవరో తెలుసా? మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni). చైన్నై సూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు కట్టబెట్టిన ధోనీ సారథిగా అశ్విన్ తన టీమ్‌ను ప్రకటించాడు. ఇందులోని 11 మందిలో ఎనిమిది మంది భారత క్రికెటర్లు కాగా.. ముగ్గురు మాత్రమే విదేశీయులు. టీ20 వరల్డ్ కప్‌లో భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను యశ్ ఓపెనర్లుగా తీసుకున్నాడు.
Ravichandran Ashwin picks his All-time IPL 11: [Cheeky Cheeka YT]
Rohit, Kohli, Raina, Surya, Devilliers, Dhoni (C & WK), Narine, Rashid, Bhuvi, Malinga, Bumrah. pic.twitter.com/Cz6C4N0Bjt
— Johns. (@CricCrazyJohns) August 28, 2024
సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్‌లు మిడిలార్డర్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు. ఎం ఎస్ ధోనీ కెప్టెన్, వికెట్ కీపర్‌గా ఉండగా.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్లు స్పిన్నర్లుగా జట్టులోకి వచ్చారు. ఇక పేస్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ(శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రాలను అశ్విన్ జట్టులోకి తీసుకున్నాడు.
అశ్విన్ ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ఎంస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), సునీల్ నరైన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.
ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలకు ఆడిన అశ్విన్ మ్యాచ్ విన్నర్‌గా పేరొందాడు. అతడు ఇప్పటివరకూ 171 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు మెగా వేలం జనవరిలో జరిగే అవకాశముంది. అందుకని ఆలోపు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలికి సమర్పించనున్నాయి.