IPL 2025 : పొట్టి ఫార్మాట్ రూపురేఖల్ని మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) దిగ్విజయంగా కొనసాగుతోంది. 2008లో మొదలైన ఈ లీగ్ ప్రతి సీజన్లో అభిమానులను అలరిస్తూ వస్తోంది. సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 18న మొదటి మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడిన మ్యాచ్ ఇప్పటికీ చిరస్మరణీయమే.
ఎందుకంటే.. కోల్‌కతా ఓపెనర్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullam) ఆర్సీబీ బౌలర్లను ఉతికేస్తూ మెరుపు శతకంతో విజృంభించాడు. తద్వారా ఐపీఎల్లో మొదటి వంద కొట్టిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కేకేఆర్ నిర్దేశించిన 223 పరుగుల ఛేదనలో రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) సారథ్యంలోని ఆర్సీబీ 82కే కుప్పకూలింది. దాంతో, కోల్‌కతా 140 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ఐపీఎల్ చరిత్రలోనే మొదటిదైన ఈ మ్యాచ్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
♾ dreams chased ✨
♾ hearts raced ❤
♾ cheers echoed 🥳Celebrating 1️⃣8️⃣ glorious years of #TATAIPL 🤩
One word for the IPL? ✍ pic.twitter.com/kNxtyQvanm
— IndianPremierLeague (@IPL) April 18, 2025
తొలి సీజన్ మొదటి మ్యాచ్ ఆడిన జట్టులో చాలామంది రిటైర్ అయ్యారు. కొందరు కోచ్‌లుగా, మెంటర్‌గా అవతారం ఎత్తారు. కానీ, ఇద్దరు మాత్రం ఇప్పటికీ కుర్రాళ్లతో పోటీ పడుతూ ఆడుతున్నారు. వాళ్లు ఎవరో తెలుసా.. విరాట్ కోహ్లీ(Virat Kohli), ఇషాంత్ శర్మ(Ishant Sharma). తొలి మ్యాచ్ నుంచి ఇప్పటికీ ఆడుతున్న క్రికెటర్లుగా వీళ్లు చరిత్ర సృష్టించారు.
మెక్కల్లమ్ 158 నాటౌట్
టాటా కంపెనీ స్పాన్సర్ చేస్తున్న 18వ ఎడిషన్‌లో ఆర్సీబీ తరఫున విరాట్ ఆడుతుండగా.. గుజరాత్ టైటాన్స్ పేస్ అస్త్రంగా లంబూ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ మొదటి సీజన్ మొట్టమొదటి మ్యాచ్‌లో కోల్‌కతా, బెంగళూరు జట్ల కెప్టెన్లు, తుది జట్టులోని ఆటగాళ్లు ఎవరంటే..?
బెంగళూరు తుది జట్టు : రాహుల్ ద్రవిడ్(కెప్టెన్), వసీం జాఫర్, విరాట్ కోహ్లీ, జాక్వెస్ కలిస్, కామెరూన్ వైట్, మార్క్ బౌచర్(వికెట్ కీపర్), బాలచంద్ర అఖిల్, ఆష్లే నొఫ్కీ, ప్రవీణ్ కుమార్, జహీర్ ఖాన్, సునీల్ జోషి.
April 18. A date that announced the future ✨ pic.twitter.com/KC8rm98zX1
— ESPNcricinfo (@ESPNcricinfo) April 18, 2025
కోల్‌కతా తుది జట్టు : సౌరవ్ గంగూలీ(కెప్టెన్), బ్రెండన్ మెక్కల్లమ్, రికీ పాంటింగ్, డేవిడ్ హస్సీ, మహమ్మద్ హఫీజ్, లక్ష్మీ రతన్ శుక్లా, వృద్ధిమాన్ సాహా, అజిత్ అగార్కర్, అశోక్ దిండా, మురళీ కార్తిక్, ఇషాంత్ శర్మ.