MLA Talasani | మారేడ్పల్లి, ఏప్రిల్ 18 : మైసమ్మతల్లి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జ్యువెల్లరీ వ్యాపారి మహేందర్ నికుంజ్ సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మైసమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, ఆలయ కమిటీ సభ్యులు నగ్మా మాలకమ్మ, పప్పి మలకమ్మ, ఆర్తి మాలకమ్మ, గౌరి నాయక్, శృతి నాయక్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, ఆలయ నిర్మాణ దాత మహేందర్ నికుంజ్, నాయకులు నాగులు, జయరాజ్, మహేష్ యాదవ్, శ్రీనాథ్, అమర్ తదితరులు పాల్గొన్నారు.