మెదక్ మున్సిపాలిటీ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో ( Medak Church) శుక్రవారం గుడ్ ఫ్రైడే (Good Friday ) సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11:30 గంటలకు శిలువను ఊరేగించిన అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఏసుక్రీస్తు ప్రాణ త్యాగం చేసిన రోజున, శిలువకు తనకు తాను లోక పాపములు పోగొట్టేందుకు శిలువ ఎక్కాడని మాజీ బిషప్ కనక ప్రసాద్, చర్చ్ ప్రేసిబిటరి ఇన్చార్జి శాంతయ్య అన్నారు. శిలువ రోజున ఏసు ప్రభువు (Jesus Christ ) పలికిన ఏడు ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈరోజు ప్రత్యేకత అని దైవ సందేశం వినిపించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మెదక్ డయాసిస్ పరిధిలోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు తరలి రావడంతో చర్చి ప్రాంతం కిటకిటలాడింది.