కోదాడ, జనవరి 11: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఖ్యాతి పాలడుగు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. బాలబాలికలు, జూనియర్, సీనియర్ ప్లేయర్లు టోర్నీలో పాల్గొంటున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, వరంగల్, హన్మకొండ తదితర జిల్లాల నుంచి వంద మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను మాజీ ఎమ్మెల్యే చందర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, పాండురంగారావు, లక్ష్మీనారాయణరెడ్డి కలిసి ప్రారంభించారు.